
మన శరీర నిర్మాణానికి ప్రోటీన్లు (మాంసకృత్తులు) ఇటుకల వంటివి. ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత ముఖ్యమో.. మన శరీరం పెరగడానికి, దృఢంగా ఉండటానికి ప్రోటీన్లు అంత అవసరం.. అందుకోసమే వైద్య నిపుణులు.. ప్రోటీన్ ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తినాలని సూచిస్తుంటారు.. ఇవి కేవలం కండరాల నిర్మాణానికే కాకుండా, అనేక కీలక శరీర విధులకు చాలా అవసరం.. ఈ కథనంలో శరీరానికి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు ఎంత అవసరమో.. వాటిని ఏయే శాఖాహారాల నుంచి పొందవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.. వాస్తవానికి చికెన్, మటన్, ఫిష్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.. అయితే.. ఎలాంటి శాఖాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.. అనే వివరాలను తెలుసుకుందాం..
ప్రోటీన్లు కొత్త కణ నిర్మాణానికి, కండరాల పటిష్టతకు, శరీర సౌష్టవానికి తోడ్పడతాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ తయారీకి, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి అత్యవసరం. అంతేకాకుండా, హార్మోన్ల ఉత్పత్తిలో ప్రోటీన్ల పాత్ర గణనీయం. చాలామంది ఎదుర్కొనే హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యకు ప్రోటీన్ లోపమే ప్రధాన కారణం అని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. కండపుష్టి, ధారుడ్యం బాగుండాలంటే ప్రోటీన్ సమృద్ధిగా ఉండాలి.
మాంసాహారాల్లోనే ప్రోటీన్ అధికంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, అనేక శాఖాహారాల్లోనూ సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తుంది.
బొబ్బర్లు, పెసలు వంటి ఎండు గింజలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని ప్రోటీన్ విలువ గణనీయంగా పెరుగుతుంది. మొలకెత్తినప్పుడు కార్బోహైడ్రేట్లు తగ్గి, ప్రోటీన్లు పెరుగుతాయి. ఎండు గింజలలో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటే, మొలకెత్తిన తర్వాత అది సుమారు 38-40 గ్రాములకు చేరుకుంటుంది. మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.. జీర్ణవ్యవస్థకు ఎటువంటి హాని కలిగించవు. ఇవి తక్కువ ఖర్చుతో, అధిక పోషక విలువలతో కూడిన ఆహారం.
అయితే.. ప్రోటీన్ ఆహారాలు కొన్నిసార్లు గ్యాస్ సమస్యకు దారితీయవచ్చు. అయితే, గ్యాస్ వస్తుందని ప్రోటీన్ ఆహారాన్ని మానేయడం చాలా నష్టదాయకం. మోషన్ ఫ్రీగా ఉండేలా చూసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి, సంతానోత్పత్తికి, వీర్యకణాల వృద్ధికి, హార్మోన్ల సమతుల్యతకు ప్రోటీన్ ఆహారం అత్యవసరం అని పేర్కొంటున్నారు.. ఆరోగ్యకరమైన, సంపూర్ణ జీవితం కోసం నిత్యం ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..