ప్రతిరోజూ ఏబీసీ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ల కలయికతో కూడిన ఆరోగ్యకరమైన శక్తివంతమైన పానీయం.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు కంటి చూపు మెరుగుదల, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మూడు పదార్థాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, కూలింగ్ డ్రింక్‌గా అద్భుతంగా పనిచేస్తుంది. ఏబీసీ డ్రింక్ (ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్) తయారీ విధానం, ప్రయోజనాలు తెలుసుకోండి.

ప్రతిరోజూ ఏబీసీ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Abc Juice

Updated on: Apr 08, 2026 | 3:55 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం.. ఉత్తమమైన జీవనశైలిని అనుసరించడం చాలా మంచిది.. అయితే, ఎండాకాలంలో బాడీని కూల్ గా ఉంచుకునేందుకు మంచి పానీయాలను, ఆహారాలను తీసుకోవాలి.. దీనివల్ల శరీరానికి పోషకాలు, శక్తి లభించడంతోపాటు.. ఆరోగ్యంగా ఉండవచ్చు.. వేసవి తాపం నుంచి బయటపడొచ్చు.. అలా మేలు చేసి పానీయాల్లో ఏబీసీ (Apple, Beetroot, Carrot) జ్యూస్ ఒకటి.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ల కలయికతో తయారైన అత్యంత పోషకమైన పానీయం.. ఆరోగ్యాన్ని కాపాడేందుకు .. పలు సమస్యల నివారణకు సహాయపడుతుంది.. దీనిలోని పోషకాలు.. చర్మాన్ని కాంతివంతం చేయడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఇంకా ఈ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేసి.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల ప్రకారం.. ఏబీసీ డ్రింక్, కంటి చూపును మెరుగుపరిచే, శరీర ఉష్ణోగ్రతను తగ్గించే, రోగనిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌.. ఈ మూడు పదార్థాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు బీట్‌రూట్ లేదా క్యారెట్ జ్యూస్‌లు విడిగా ఇవ్వడం కష్టమైనప్పుడు.. ఈ ఏబీసీ డ్రింక్ వారికి ఆకర్షణీయంగా ఉండి, మంచి ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.

ఏబీసీ డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు:

* యాపిల్ – 1

* బీట్‌రూట్ – సగం

* క్యారెట్ – 2

* తేనె – 1 టేబుల్ స్పూన్

* పుదీనా – కొద్దిగా

తయారీ విధానం:

1. ముందుగా యాపిల్‌ను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్క తీయడం వల్ల జ్యూస్ మరింత రుచిగా, సులువుగా తయారవుతుంది.

2. బీట్‌రూట్‌ను కూడా తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బీట్‌రూట్ ఎక్కువ వేస్తే రుచి ఘాటుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, సగం బీట్‌రూట్ మాత్రమే ఉపయోగించడం మంచిది.

3. క్యారెట్‌ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్‌కు తొక్క తీయాల్సిన అవసరం లేదు.

4. కట్ చేసుకున్న యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ ముక్కలను ఒక మిక్సీ జార్‌లో వేయాలి.

5. అందులో కొద్దిగా పుదీనా ఆకులను వేసి, కొద్దిగా నీళ్లు (ఒక చుక్క) పోసి మెత్తగా నలిగే వరకు బ్లెండ్ చేయాలి.

6. బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వడకట్టి, స్వచ్ఛమైన జ్యూస్‌ను మాత్రమే తీసుకోవాలి. చాలామంది వడకట్టకుండా జ్యూస్‌ను తీసుకుంటారు.. కానీ అలా తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కారణంగా మూడు నుండి నాలుగు గంటల వరకు ఆకలి వేయకపోవచ్చు. జ్యూస్‌ను వడకట్టడం వల్ల పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి.

జ్యూస్‌ను గ్లాస్‌లో పోసుకున్న తర్వాత, డయాబెటిస్ సమస్య ఉన్నవారు 1 నుండి 1.5 స్పూన్ల తేనెను కలుపుకోవచ్చు. సాధారణ వ్యక్తులు 3 నుండి 4 స్పూన్ల తేనెను ఉపయోగించుకోవచ్చు. రుచి కోసం అవసరమైతే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు, లేదా నిమ్మరసం లేకుండానే తీసుకోవచ్చు. ఈ జ్యూస్ రుచికరంగా ఉండటంతో పాటు ఎన్నో పోషకాలను అందిస్తుంది. బీట్‌రూట్, క్యారెట్‌లను సాధారణంగా కూరగాయల జ్యూస్‌లలో తీసుకుంటూ ఉంటారు.. వాటికి ఆపిల్‌ను జోడించడం ద్వారా వేసవిలో చక్కటి కూలింగ్ డ్రింక్‌గా మారుతుంది. ఇది ఏ వయసు వారికైనా సులువుగా తాగగలిగే పానీయం.

ఈ ఏబీసీ డ్రింక్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం బెటర్..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us