మంచిదని చికెన్, మటన్ లివర్‌ను ఇష్టంగా కుమ్మేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..

మటన్, చికెన్.. అనగానే.. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంతో తింటారు.. అయితే.. కోడి లేదా మేక లివర్ (కాలేయం) కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. పోషకాలకు దేనికదే ప్రసిద్ధి చెందింది.. చికెన్ - మటన్ లివర్ (కాలేజా) భారతీయ వంటకాల్లో.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందింది.

మంచిదని చికెన్, మటన్ లివర్‌ను ఇష్టంగా కుమ్మేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..
Chicken And Mutton Liver

Updated on: Feb 21, 2026 | 12:29 PM

మటన్, చికెన్.. అనగానే.. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంతో తింటారు.. అయితే.. కోడి లేదా మేక లివర్ (కాలేయం) కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. పోషకాలకు దేనికదే ప్రసిద్ధి చెందింది.. చికెన్ – మటన్ లివర్ భారతీయ వంటకాల్లో.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. చాలా మంది ఇష్టంగా కొని తెచ్చుకుని.. పలు రకాలుగా వండి తింటారు.. ఫ్రై లేదా కూరగా చేసుకుని తింటారు.. అియతే.. రంజాన్ వంటి పండుగల సమయంలో దీనికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ పోషకమైన ఆహారం ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది..? లేదా ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా..? అనే విషయంపై చాలామందికి స్పష్టత లేదు. అయితే.. చికెన్, మటన్ లివర్ ప్రయోజనాలు, ప్రమాదాలు, తినవలసిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లివర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

లివర్ ఒక “న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్” లేదా పోషకాల గని అని చెప్పవచ్చు. దీనిలో విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్, జింక్ పుష్కలంగా ఉంటాయి.

రక్తహీనత నివారణ: లివర్‌లో హీమ్ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సాధారణ ఐరన్ కంటే సులభంగా శరీరంలో గ్రహించబడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి లివర్ చాలా మంచిది, ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

విటమిన్ ఎ స్టోరేజ్: లివర్ విటమిన్ ఎకి ఒక నిల్వ గృహం. ఇది దృష్టికి, రోగనిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం.

మెదడు ఆరోగ్యం – శక్తి: విటమిన్ బి12, కొలీన్ సమృద్ధిగా ఉండటం వల్ల లివర్ మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది అలసటను తగ్గిస్తుంది, శక్తిని పెంచుతుంది.

సూపర్ ఫుడ్: తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారాలలో లివర్ ఒకటి.

లివర్ వినియోగంతో ముడిపడి ఉన్న ప్రమాదాలు:

లివర్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని అధిక వినియోగం కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అయితే, లివర్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. లివర్‌లో విటమిన్ ఎ అత్యధికంగా ఉంటుంది.. 100 గ్రాముల లివర్‌లో సిఫార్సు చేయబడిన రోజువారీ పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ ఉండవచ్చు. విటమిన్ ఎ అనేది ఫ్యాట్-సాల్యుబుల్ విటమిన్ కాబట్టి, ఇది శరీరంలో పేరుకుపోయి టాక్సిసిటీకి దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు దీనిని నివారించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, జంతువుల లివర్ హెవీ మెటల్స్ (లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్)ను నిల్వ చేసుకునే అవకాశం ఉంది, ఇవి దీర్ఘకాలంలో కిడ్నీలు, ఎముకలకు హాని కలిగిస్తాయి. అందువల్ల, లివర్‌ను వారానికి ఒకసారి, 50-75 గ్రాములకు మించకుండా మితంగా తీసుకోవడం శ్రేయస్కరమని డైటీషియన్లు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లివర్ ను మితంగా తీసుకోవడమే మంచిది. వారానికి ఒకసారి, 50 నుండి 75 గ్రాముల లివర్‌ను మాత్రమే తీసుకోవడం సురక్షితం. చికెన్ కర్రీలో ఒకటి రెండు లివర్ ముక్కలు తీసుకోవడం తప్పుకాదు కానీ, విడిగా లివర్ డిష్‌లను తరచుగా తినడం మానుకోవాలి. హెవీ మెటల్స్ కంటామినేషన్ తగ్గించడానికి, కాలుష్యం లేని వాతావరణంలో పెరిగిన జంతువుల లివర్‌ను ఎంచుకోవడం మంచిది. లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ లేదా విటమిన్ ఎ సప్లిమెంట్లు తీసుకుంటున్నవారు లివర్‌ను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.

లివర్ సూపర్ ఫుడ్.. కానీ.. సరైన మోతాదులో, సరైన జాగ్రత్తలతో తీసుకున్నట్లయితే ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అతిగా తీసుకుంటే విటమిన్ ఎ టాక్సిసిటీచ హెవీ మెటల్స్ కారణంగా ప్రమాదాలు సంభవించవచ్చు.. అంటున్నారు నిపుణులు..

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us