Shaving Tips: షేవింగ్ తర్వాత మంటగా ఉండొద్దంటే ఇలా చేయండి చాలు.. ఈ టిప్స్ మీ కోసమే..

|

Jan 30, 2023 | 1:48 PM

షేవింగ్ చేసిన తర్వాత మీ చర్మంపై ఎరుపు, చికాకుగా ఉంటే ఈ చిట్కాలతో మంటను దూరం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసకుందాం..

Shaving Tips: షేవింగ్ తర్వాత మంటగా ఉండొద్దంటే ఇలా చేయండి చాలు.. ఈ టిప్స్ మీ కోసమే..
Shaving
Follow us on

షేవింగ్ తర్వాత తరచుగా ముహం ఎరుపు, చికాకును మారుతుంది. కొంతమంది పురుషుల చర్మంపై రేజర్ కట్‌లు కూడా కనిపిస్తాయి. ముఖం నుంచి రక్తం రావడం.. ఆందోళన చెందడం కూడా మనం చూస్తుంటాం. సున్నితమైన చర్మం, రేజర్ లేదా షేవింగ్ క్రీమ్ వల్ల ఈ సమస్యలు రావచ్చు. షేవింగ్ తర్వాత మండుతున్న అనుభూతిని కూడా చూసి ఉంటాం. ఇలాంటి సమయంలో మనం వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తుంటాం. ఇది ఒక్కోసారి ముఖానికి కూడా హాని కలిగిస్తుంది. మీరు కొన్ని సాధారణ నివారణలను ప్రయత్నించడం ద్వారా కూడా షేవింగ్ తర్వాత మంట తగ్గించుకోవచ్చు.

అలోవెరా జెల్..

షేవింగ్ తర్వాత ముఖం ఎర్రగా మారడాన్ని తగ్గించడానికి అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ అంశాలు ముఖంపై వాపు , చికాకులో తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. దీని కోసం తాజా కలబంద జెల్ ఉపయోగించండి. షేవింగ్ చేసిన తర్వాత మీ ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. అలోవెరా జెల్‌ను 2-3 సార్లు ముఖంపై అప్లై చేయడం వల్ల ఎరుపు, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఐస్ ఉపయోగించండి

షేవింగ్ చేసేటప్పుడు చాలా సార్లు ముఖం మీద రేజర్ కట్స్ ఏర్పడుతాయి. దీని కారణంగా ముఖంపై ఎరుపు, మంట, చర్మంపై గాయాల నుంచి రక్తస్రావం అవుతుంది. షేవింగ్ తర్వాత వచ్చే ఈ సమస్యల నుంచి ఐస్ ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం ఐస్ క్యూబ్‌ను ఉపయోగించండి. షేవింగ్ చేసిన తర్వాత దానితో మీ ముఖాన్ని మసాజ్ చేయండి. ఐస్ చర్మాన్ని చల్లబరుస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ తగ్గిస్తుంది.

కొబ్బరి నూనే

కొబ్బరి నూనె కూడా షేవింగ్ తర్వాత మంట, ఎరుపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం కొబ్బరి నూనెను చేతులతో తీసుకుని ముఖంపై  రాయండి. కొంత సమయం పాటు చర్మంపై ఉంచండి. తర్వాత నీటితో కడగాలి. దీంతో చర్మం మృదువుగా, హైడ్రేటెడ్ గా మారుతుంది. ఎరుపు, చికాకు కూడా పోతుంది.

పసుపు నీరు

షేవింగ్ తర్వాత ఎరుపు , చికాకును తొలగించడానికి పసుపు నీరు కూడా ఉపయోగపడుతుంది. దీని కోసం.. పసుపు, నీటిని కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇది చర్మపు చికాకు, వాపును తగ్గిస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం