
ఆషాఢమాసం రాగానే ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి ఎంతో ఉత్సాహపడతారు. జులై 15 2026 బుధవారం నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానుంది. అయితే.. చేతులకు, కాళ్లకు గోరింటాకు కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో, అట్లతద్ది వంటి పండుగల రోజున గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం. గోరింటాకు సహజమైన ఎరుపు రంగును పొందడానికి కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించడం అవసరం. ఈ కథనంలో గోరింటాకును ఎర్రగా పండించడానికి కావాల్సిన తయారీ పద్ధతిని, జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం..
ఆకుల శుభ్రత: ముందుగా సేకరించిన గోరింటాకు ఆకులను ఒక పేపర్ మీద వేసి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఇందులో కాడలు, కాయలు లేదా ఇతర మలినాలు లేకుండా చూసుకోవాలి. మిక్సీలో రుబ్బేటప్పుడు కాడలు అడ్డుపడకుండా ఉండటానికి ఈ శుభ్రత చాలా ముఖ్యం.
మిక్సీలో రుబ్బడం: శుభ్రం చేసుకున్న గోరింటాకు ఆకులను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మొదట ఎలాంటి నీటినీ కలపకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. మీ వద్ద ఎక్కువ గోరింటాకు ఉన్నట్లయితే, కొద్దికొద్దిగా రెండు, మూడు సార్లు రుబ్బుకోవడం మంచిది.
ఈ పదార్థాలన్నీ కలిపి మళ్లీ మిక్సీ మూత పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
పెరుగు/మజ్జిగ చేరిక: చివరిగా, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగును చేర్చుకోవాలి. మీ వద్ద పెరుగు లేకపోతే మజ్జిగను కూడా ఉపయోగించవచ్చు. పెరుగు గోరింటాకును మరింత మెత్తగా రుబ్బడానికి, అలాగే రంగును వృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఈ మిశ్రమాన్ని బాగా మెత్తని పేస్ట్‌లా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి.
బౌల్‌లోకి తీసుకోవడం: మెత్తగా రుబ్బిన గోరింటాకు పేస్ట్‌ను వేరొక బౌల్‌లోకి తీసుకోవాలి. చేతులకు అంటుకోకుండా స్పూన్‌తో తీయడం లేదా గ్లౌజులు ధరించడం మంచిది. ఎందుకంటే.. గోరింటాకు డిజైన్ వేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
పైన చెప్పిన విధంగా తయారుచేసిన గోరింటాకును పెట్టుకుంటే ఒక గంటలోనే మంచి ఎరుపు రంగు వస్తుంది.
మర్చిపోయినట్లయితే ప్రత్యామ్నాయం: ఒకవేళ గోరింటాకు రుబ్బేటప్పుడు నిమ్మరసం, చక్కెర వంటివి వేయడం మర్చిపోయినట్లయితే ఒక ప్రత్యామ్నాయ చిట్కా ఉంది. ఒక బౌల్‌లో ఒక నిమ్మకాయ రసం, రెండు స్పూన్ల చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని గోరింటాకు పెట్టుకునే ముందు చేతులకు అప్లై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత గోరింటాకు పెట్టుకుంటే మంచి రంగు వస్తుంది.
ఆరిన తర్వాత: గోరింటాకు పూర్తిగా ఆరిన తర్వాత తీసివేయాలి. చేతులను నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత, కొద్దిగా కొబ్బరినూనెను చేతులకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోరింటాకు రంగు మరింత మెరుగుపడి, నిగారింపు వస్తుంది. ఈ ఆషాఢమాసంలో ఈ చిట్కాలను పాటించి, మీ చేతులకు ఎర్రటి గోరింటాకును పలు డిజైన్లలో అలంకరించుకోండి.
గోరింటాకు రంగు వ్యక్తి చర్మ స్వభావం, శరీర ఉష్ణోగ్రత, గోరింటాకు నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో లభించే రసాయనాలు కలిపిన “ఇన్‌స్టంట్ బ్లాక్ హెన్నా” వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సహజ గోరింటాకు వాడటం ఆరోగ్యానికి సురక్షితం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..