నీళ్లు తాగడం లేదా? అయితే డేంజరే మరి..!

| Edited By: Srinu

Oct 09, 2019 | 5:17 PM

కంప్యూటర్ కిడ్నీ.. మూత్రపిండ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణ. సాధారణంగా తక్కువ నీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. ఇదే కొనసాగితే ఒక్కోసారి కిడ్నీలు చెడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే నీటిని తగినంతగా తాగాల్సిందే. కిడ్నీ సమస్య ఉన్నవారు నీళ్లను తాగాలి. కానీ బీపీ వంటి ఇతర సమస్యలతో బాధపడేవారు నీటితోనే మందులు వేసుకోవాలి. ఒక్కోసారి ఆస్ప్రిన్ కూడా ఇస్తుంటారు. ఇవన్నీ కూడా కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంటాయి. అయితే […]

నీళ్లు తాగడం లేదా? అయితే డేంజరే మరి..!
Follow us on

కంప్యూటర్ కిడ్నీ.. మూత్రపిండ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణ. సాధారణంగా తక్కువ నీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. ఇదే కొనసాగితే ఒక్కోసారి కిడ్నీలు చెడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే నీటిని తగినంతగా తాగాల్సిందే. కిడ్నీ సమస్య ఉన్నవారు నీళ్లను తాగాలి. కానీ బీపీ వంటి ఇతర సమస్యలతో బాధపడేవారు నీటితోనే మందులు వేసుకోవాలి. ఒక్కోసారి ఆస్ప్రిన్ కూడా ఇస్తుంటారు. ఇవన్నీ కూడా కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంటాయి. అయితే ఇలాంటి విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేసే కొత్త సాధనం కంప్యూటర్ కిడ్నీని ఆవిష్కరించారు. కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనితా లేటన్ మాట్లాడుతూ మూత్రపిండాల వ్యవస్థలో కలిగే మార్పులను ఇది ఎప్పటికప్పడు గమనిస్తుందన్నారు.

ఎవరైనా సరే నీటిని తక్కువగా తాగినప్పటికీ మూత్ర విసర్జన జరిగేలా కిడ్నీలు దోహదం చేస్తాయి. అయితే వృద్ధులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ట్రీట్‌మెంట్ తీసుకునే వారు అధికంగా మూత్రవిసర్జన చేస్తారు. వీరు అధికంగా మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్రాన్ని కిడ్నీ నుంచి బ్లాడర్‌కు తీసుకెళ్లే కండరాల సంకోచంలో సమస్యలు వస్తాయి. తాజాగా తయారు చేసిన కంప్యూటర్ కిడ్నీ ఈ సంకోచాలను లెక్కిస్తుంది. అదే సమయంలో కిడ్నీ సమస్యలతో బాధపడే రోగులు ఆస్ప్రిన్ తీసుకోవడంతో పలు సమస్యలు తలెత్తుతాయని ఈ కంప్యూటర్ కిడ్నీ గుర్తించింది. మూత్రపిండ సమస్యలున్నవారు తగినంత నీటిని తీసుకోవాలని లేటన్ తెలిపారు.