
టీ, బిస్కెట్లు తినడం అప్పటికప్పుడు ఆకలిని తగ్గించినా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో మాత్రం వెనుకబడతాయి. ముఖ్యంగా ప్యాకెట్ బిస్కెట్లలో మైదా, చక్కెర, కొవ్వులు అధికంగా ఉంటాయి. తీపి కలిపిన టీ కూడా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం చూపుతుంది. ప్రొటీన్లు, ఫైబర్ తక్కువగా ఉండే ఇలాంటి అల్పాహారం రోజువారీ శక్తి, ఆకలి నియంత్రణ, జీవక్రియపై ప్రభావం చూపవచ్చు. కన్సల్టెంట్ డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం టీతో పాటు మైదాతో తయారైన బిస్కెట్లు, చక్కెర కలిపిన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పెరుగుదలను నియంత్రించేందుకు శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లు తరచుగా కొనసాగితే కొంతమందిలో ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) వచ్చే ప్రమాదం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, బిస్కెట్లలో ఫైబర్, ప్రొటీన్లు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండదు. ఉదయం 10 గంటలకే మళ్లీ ఆకలి వేయడం, అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రీడయాబెటిస్ ఉన్నవారు ఇలాంటి ఆహారపు అలవాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
టీ, బిస్కెట్లను మాత్రమే అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందకుండా పోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.
టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే దానితో పాటు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం టీతో బిస్కెట్లు తినడం అప్పుడప్పుడు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ ప్రతిరోజూ వాటినే పూర్తి అల్పాహారంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అల్పాహారంలో చేర్చుకోవాలి. ఉదయం టీ తాగే అలవాటును కొనసాగిస్తూనే బిస్కెట్ల స్థానంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. చిన్న చిన్న ఆహారపు మార్పులే దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నోట్: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, మధుమేహం లేదా ఐరన్ లోపం వంటి సమస్యలు ఉన్నవారు డైటీషియన్ లేదా వైద్యుల సలహా మేరకు ఆహార మార్పులు చేసుకోవాలి.