weight loss: బరువు తగ్గాలా.? మంచి నీళ్లు తాగండి చాలు..

|

Jul 02, 2024 | 9:41 PM

బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు జీవన విధానం వరకు ఎన్నో మార్పులు చేసుకుంటారు. వర్కవుట్స్ అంటూ జిమ్‌ల బాటపడుతుంటారు. అయితే మంచి నీళ్లు తాగితే చాలు బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆహార అలవాట్లను విశ్లేషించిన అనంతరం పరిశోధకులు...

weight loss: బరువు తగ్గాలా.? మంచి నీళ్లు తాగండి చాలు..
Drinking Water
Follow us on

బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తీసుకునే ఆహారం మొదలు జీవన విధానం వరకు ఎన్నో మార్పులు చేసుకుంటారు. వర్కవుట్స్ అంటూ జిమ్‌ల బాటపడుతుంటారు. అయితే మంచి నీళ్లు తాగితే చాలు బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆహార అలవాట్లను విశ్లేషించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

సాధారణంగా విపరీతంగా దాహం వేసిన సమయంలో కొందరు కూల్‌ డ్రింక్స్‌, పళ్ల రసాలు వంటి తీసుకుంటారు. అయితే చక్కెర కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఇలాంటి డ్రింక్స్‌ తీసుకుంటే బరువు పెరగడానికి కారణమవుతుందని, అందుకే వీటికి బదులుగా మంచి నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొంత మందిని పరిగణలోకి తీసుకొని, వారి ఆహారపు అలవాట్లను విశ్లేషించారు.

సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా రోజుకు .2 కప్పుల నీళ్లు, 2,157 కేలరీలను తీసుకుంటున్నట్టు గుర్తించారు. అయితే నీళ్లు ఎక్కువగా తీసుకున్న వారు కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. రోజుకు ఎక్కువగా నీళ్లు తాగిన వారిలో 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్లు తేలింది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలని చెబుతున్నారు.

ఇక తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, మలబద్ధకం దరిచేరకుండా ఉండాలన్నా తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంచడంతో పాటు సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్నా తగినంత నీరు తీసుకోవాలని చెబుతున్నారు. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..