రూపాయి ఖర్చు లేదు.. ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..

ఇంట్లో డ్రైనేజీ నుంచి దుర్వాసన రావడం, బాత్రూమ్‌లో పురుగులు, కిచెన్‌లో బొద్దింకలు కనిపించడం సాధారణ సమస్య. వీటి నియంత్రణ కోసం కొన్ని చిట్కాలను పాటించవచ్చు.. అయితే, ముఖ్యంగా క్లీన్ గా ఉంచుకునేందుకు సహజమైన పద్దతులను అవలంభించాలని సూచిస్తున్నారు. దీనిద్వారా.. ఇంటిని క్లీన్ గా ఉంచుకోవచ్చు..

రూపాయి ఖర్చు లేదు.. ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
Drain Smell Home Remedy

Updated on: Aug 20, 2026 | 1:09 PM

పరిసరాల పరిశుభ్రతతో మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడడంతోపాటు.. దోమలు, ఈగలు, హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి అత్యంత ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. మన ఇంటితోపాటు.. బాత్రూమ్‌ను క్లీన్ గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా.. మని ఇంటిని, బాత్రూంని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.. ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం.. మన ఇంట్లో కొన్నిసార్లు ఉపయోగించని లేదా ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు మిగిలిపోతుంటాయి. వీటిని కేవలం పారవేయడం కాకుండా, వివిధ గృహావసరాలకు తెలివిగా ఉపయోగించుకోవచ్చు. ఈ కథనంలో పాత మందులను ఇంటి శుభ్రతకు ఎలా వినియోగించవచ్చో తెలుసుకుందాం..

బాత్రూమ్ – డ్రైనేజీ శుభ్రత, చెడు వాసనల నివారణ:

బాత్రూమ్, సింక్ నుండి వచ్చే చెడు వాసనలు చాలామందికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎక్స్పైర్ అయిన జ్వరం లాంటి  టాబ్లెట్లు బాగా ఉపయోగపడతాయి. ఒక బౌల్‌లో వేడి నీటిని తీసుకుని, ఐదు జ్వరం టాబ్లెట్లను అందులో వేసి పూర్తిగా కరిగించాలి. టాబ్లెట్లు త్వరగా కరగడానికి స్పూన్‌తో నలుపవచ్చు. ఈ ద్రావణాన్ని కిచెన్ సింక్ హోల్స్, వెస్ట్రన్ లేదా ఇండియన్ టాయిలెట్లలో, బాత్రూమ్/వాష్ ఏరియా డ్రైనేజీలలో క్రమం తప్పకుండా (పదిహేను రోజులకొకసారి) పోయాలి. ఇదే కాకుండా.. బ్లీచింగ్ పౌడర్ ను వేడి నీటిలో కలిపి వేసుకోవచ్చు..

ఇలా చేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ లోపల పేరుకుపోయిన మురికి శుభ్రమై, దుర్వాసనలు తగ్గిపోతాయి. అంతేకాకుండా, చిన్న దోమలు, పురుగులు, లార్వా, బొద్దింకలు వంటివి లోపల చేరకుండా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలామంది వేడి నీరు పైపులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన చెందుతారు. అయితే, ఈ ద్రావణంలోని వేడి అంత ఎక్కువ ఉండదు.. పైపులు సాధారణంగా యాసిడ్‌ను కూడా తట్టుకునేలా తయారవుతాయి కాబట్టి ఎటువంటి నష్టం జరగదని గమనించాలి.

కిచెన్‌లో బొద్దింకల నియంత్రణ:

కిచెన్‌లో బొద్దింకలు ఒక పెద్ద సమస్య. వీటిని సమర్థవంతంగా నియంత్రించడానికి ఎక్స్పైర్ అయిన మెడిసిన్‌ను ఉపయోగించవచ్చు. ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకుని, అందులో ఏదైనా ఎక్స్పైర్ అయిన టాబ్లెట్‌ను పొడి చేసి కలిపి చల్లొచ్చు.. ఈ విధంగా, ఎక్స్పైర్ అయిన మందులతో ఇంటిలోని వివిధ సమస్యలకు సులభంగా, సురక్షితంగా, ఖర్చు లేకుండా పరిష్కారం పొందవచ్చు.

అయితే.. వీటికి బదులు.. డ్రైనేజీ దుర్వాసన, బొద్దింకల సమస్యకు సురక్షితమైన క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్ పద్ధతులను పాటించడం మంచిది.

గమనిక.. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లను నేరుగా ఇంటి శుభ్రం చేయడానికి (క్లీనింగ్) వాడటం సురక్షితం కాదు. గడువు తీరిన మందులలో రసాయన మార్పులు జరిగి, చర్మానికి హాని చేయవచ్చు లేదా విషపూరిత వాయువులు వెలువడే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని క్లీనింగ్ కోసం ఉపయోగించకపోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us