Health: గుండెలో మంటగా ఉంటుందా.? అస్సలు లైట్ తీసుకోకండి..

|

Jul 29, 2024 | 10:29 AM

గుండెలో మంటగా అనిపించడం సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడే ఉంటాం. అయితే గుండె మంట అనగానే గుండె సంబంధిత సమస్యే కావొచ్చని చాలా మంది భావిస్తుంటారు. కానీ గుండెలో మంటగా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలా అని గుండెలో మంటను లైట్ తీసుకుంటే ప్రమాదం తప్పదని...

Health: గుండెలో మంటగా ఉంటుందా.? అస్సలు లైట్ తీసుకోకండి..
Heart Burn
Follow us on

గుండెలో మంటగా అనిపించడం సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడే ఉంటాం. అయితే గుండె మంట అనగానే గుండె సంబంధిత సమస్యే కావొచ్చని చాలా మంది భావిస్తుంటారు. కానీ గుండెలో మంటగా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలా అని గుండెలో మంటను లైట్ తీసుకుంటే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ గుండెలో మంటగా అనిపించడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండెలో మంట కలగడానికి జీర్ణ సంబంధిత సమస్యలు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి కారణంగా గుండెలో మంటగా అనిపించే అవకాశం ఉంటుంది. కడుపులో ఆమ్లం ఆహార పైపు నుంచి పైకి వస్తుంది. ఈ కారణంగానే గుండెలో మంట కలుగుతున్న భావక అనిపిస్తుంది. దీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడుతంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* గుండెలో మంటగా అనిపించడానికి మరో ప్రధాన కారణాల్లో పెప్టిక్‌ అల్సర్‌ ఒకటి. కడపు లేదా పేగులో గాయం ఉన్నట్లయితే ఛాతీలో మంట భావన కలుగుతుంది. పెప్టిక్‌ అల్సర్‌ రావడానికి కడుపులో అధికంగా యాసిడ్ ఉత్పత్తి కావడం లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* కొన్నిసార్లు గుండెల్లో మంట కూడా గుండె జబ్బులకు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండెలో బర్నింగ్ సెన్సేషన్‌తో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా.. ఛాతిలో బరువుగా ఉన్నట్లు భావన కలిగినా గుండె సమస్యకు ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* గుండెలో మంటగా ఉండడానికి ఒత్తిడి కూడా మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతుంటే కూడా గుండె బరువెక్కినట్లు ఉంటుంది. తరచూ భయంగా ఉండడం, హృదయ స్పందన పెరగడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి.

* ఇక తీసుకునే ఆహారంలో చేసే తప్పులు కూడా గుండెలో మంటకు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అధికంగా వేయించిన, కారం, ఆమ్ల ఆహాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..