ఈ- సిగరెట్ల విషయం చూద్దురూ.. మోదీకి డాక్టర్ల లెటర్

|

Apr 19, 2019 | 6:55 PM

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ సిగరెట్లపై వెంటనే నిషేధం విధించాలంటూ 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా డాక్టర్లు ప్రధానికి లేఖ రాశారు. ఎలక్ట్రానిక్ నికోటిన్‌ డెలివరీ సిస్టం (ఈఎన్‌డీఎస్)తో కూడిన ఈ-సిగరెట్లు, ఈ-హుక్కాలతో పాటు విరివిగా దొరుకుతున్న వేప్‌, వేప్‌ పెన్‌ లాంటి వస్తువులు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సిగరెట్‌ వేపర్‌లో పొగాకును మించి హానికరమైన రసాయనాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. ఇక ఈ-సిగరెట్ల […]

ఈ- సిగరెట్ల విషయం చూద్దురూ.. మోదీకి డాక్టర్ల లెటర్
Follow us on

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ సిగరెట్లపై వెంటనే నిషేధం విధించాలంటూ 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా డాక్టర్లు ప్రధానికి లేఖ రాశారు. ఎలక్ట్రానిక్ నికోటిన్‌ డెలివరీ సిస్టం (ఈఎన్‌డీఎస్)తో కూడిన ఈ-సిగరెట్లు, ఈ-హుక్కాలతో పాటు విరివిగా దొరుకుతున్న వేప్‌, వేప్‌ పెన్‌ లాంటి వస్తువులు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సిగరెట్‌ వేపర్‌లో పొగాకును మించి హానికరమైన రసాయనాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. ఇక ఈ-సిగరెట్ల మీద గతేడాది కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధం విధించాలంటూ ఆదేశాలు జారీ చేసినా..అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు.