Lifestyle: ఉదయంలేవగానే ఆకలి వేస్తుందా.? కారణం ఏంటంటే..

|

Jun 29, 2024 | 3:54 PM

ఆకలి వేయడం సర్వసాధారణమైన విషయం. అయితే అతిగా ఆకలి వేసినా, అస్సలు ఆకలి వేయకపోయినా శరీరంలో ఏదో పొరపాటు జరుగుతున్నట్లు భావించాలని నిపుణుల చెబుతుంటారు. ఆకలి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. సాధారణంగా ఎక్కువసేపు భోజనం చేయకుండా ఉంటే ఆకలి వేస్తుందని తెలిసిందే. ఇక కొందరిలో రాత్రి ఎంత తిని పడుకున్నా...

Lifestyle: ఉదయంలేవగానే ఆకలి వేస్తుందా.? కారణం ఏంటంటే..
Hungry
Follow us on

ఆకలి వేయడం సర్వసాధారణమైన విషయం. అయితే అతిగా ఆకలి వేసినా, అస్సలు ఆకలి వేయకపోయినా శరీరంలో ఏదో పొరపాటు జరుగుతున్నట్లు భావించాలని నిపుణుల చెబుతుంటారు. ఆకలి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. సాధారణంగా ఎక్కువసేపు భోజనం చేయకుండా ఉంటే ఆకలి వేస్తుందని తెలిసిందే. ఇక కొందరిలో రాత్రి ఎంత తిని పడుకున్నా ఉదయం లేవగానే ఆకలిగా ఉంటుంది. గొంతు పొడిబారుతుంటుంది. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ లక్షణాలు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి సరిగ్గా భోజనం చేసి పడుకున్నా కొందరిలో ఉదయం లేవగానే పొట్ట ఖాళీ అయిన భావన కలుగుతుంది. శరీరంలో అస్సలు బలం లేనట్లు అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాత్రిపూట ఆహారం తీసుకుంటే రక్తంలో ఒక్కసారిగా చక్కెర స్థాయి పెరుగుతుంది. అయితే ఆహారం క్రమంగా జీర్ణమయ్యే కొద్దీ తగ్గుతుంటుంది. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గగానే మళ్లీ ఆకలి వేస్తుంది.

ఇక రాత్రుళ్లు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దాహం వేయడంతో పాటు ఉదయం లేవగానే ఆకలిగా కూడా అనిపిస్తుంది. ‘జర్నల్ న్యూట్రియెంట్స్’ నివేదిక ప్రకారం, రాత్రి భోజనం చేసిన తర్వాత క్లోమంలో ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అధిక ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే 2 గ్లాసుల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే 2 గంటల ముందు కచ్చితంగా ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి పూట ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు అటుఇటు నడవాలి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాత్రుళ్లు ఆలస్యంగా తిన్నా, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్న ఉదయం త్వరగా ఆకలి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..