Gas Cylinders: గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి..

|

Mar 14, 2022 | 3:55 PM

ప్రస్తుతం దాదాపు అందరు వంట గ్యాస్‌ సహాయంతోనే వంట చేసుకుంటున్నారు. అయితే సిలిండర్‌పై వంట చేసేటప్పుడు చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు...

Gas Cylinders: గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి..
Cooking
Follow us on

ప్రస్తుతం దాదాపు అందరు వంట గ్యాస్‌(Gas Cylinders) సహాయంతోనే వంట చేసుకుంటున్నారు. అయితే సిలిండర్‌పై వంట చేసేటప్పుడు చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. అందుకే గ్యాస్‌ స్టవ్‌(stove)పై వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దుబాయ్(dubai) మునిసిపాలిటీ జాబితా తయారు చేసింది. “గ్యాస్ సిలిండర్లను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఇంట్లో ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు. మీ భద్రత, మీ కుటుంబం భద్రతను ఎల్లప్పుడు దృష్టిలో ఉంచుకోవాలని”అని ట్వీట్‌ చేసింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. గ్యాస్ సిలిండర్‌ను ఉంచడానికి సరైన స్థలాన్ని ఎంచుకోండి. (వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి )

2. గ్యాస్ పైప్‌లైన్‌లు, వాల్వ్‌లు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.

3. వంట పూర్తైన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి.

4. గ్యాస్ సిలిండర్‌ను మండే పదార్థాలు, విద్యుత్ స్విచ్‌ల నుంచి దూరంగా ఉంచండి.

5. గ్యాస్ సిలిండర్‌ను నేలపై అడ్డంగా తిప్పడం లేదా వంచడం మానుకోండి.

6. ఒక కంపెనీ గ్యాస్ సిలిండర్లకు మరోక గ్యాస్ కంపెనీకి ఉపయోగించిన రెగ్యులేటర్‌ను వాడకూడదు.

Read also.. Fingernails Bite: గోర్లు కొరుకుతున్నారా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్టే.. అవేంటంటే..