Alcohol: ఆల్కహాల్‌ తీసుకుంటే.. వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?

|

Aug 11, 2024 | 5:16 PM

అయితే ఆల్కహాల్‌ మితంగా తీసుకుంటే ఇలా ఉంటుంది. అదే పరిమితికి మించితే మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండె మొదలు లివర్‌ వరకు శరీరంలోని అన్ని భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు...

Alcohol: ఆల్కహాల్‌ తీసుకుంటే.. వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?
Alcohol
Follow us on

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మద్యం ప్రియులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. అంతెందుకు చివరికి మందు బాటిల్‌పైనే మద్యం ఆరోగ్యానికి మంచిది కాదని రాసి ఉన్నా.. తెగ తాగేస్తుంటారు. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న వెంటనే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వీటిలో మొదటిది మెదడు ఉత్తేజానికి గురవుతుంది. శరీరం ఉత్సాహంగా మారుతుంది. ఆల్కహాల్‌ తీసుకున్న తర్వాత శరీరంలో విడుదలయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లే దీనికి కారణంగా చెప్పొచ్చు.

అయితే ఆల్కహాల్‌ మితంగా తీసుకుంటే ఇలా ఉంటుంది. అదే పరిమితికి మించితే మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండె మొదలు లివర్‌ వరకు శరీరంలోని అన్ని భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే మద్యాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇక ఆల్కహాల్‌ తీసుకున్న వారిలో సహజంగా ఎదురయ్యే సమస్యల్లో వాంతులు ఒకటి. ఇంతకీ ఆల్కహాల్‌ కారణంగా వాంతులు ఎందుకు అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్‌ శరీరంలోకి ఎంటర్‌ కాగానే మొదటి దశ విచ్ఛిన్న ప్రక్రియలో ఏర్పడిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థమే వాంతులకు కారణంగా చెబుతారు. శరీరంలో ఈ రసాయనం విడుదలైనప్పుడు వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా తీసుకోగానే వాంతులు అవుతున్నాయంటే.. మీ శరీరం నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపించాలంటూ మెదడు ఇచ్చిన ఆఖరి సూచనగా భావించాలి. ఆల్కహాల్‌ మోతాదుకు మించినట్లయితే వెంటనే మీ శరీరం దాన్ని బయటకు పంపించేస్తుంది.

ఇక మద్యం తీసుకోగానే.. జీర్ణాశయంలోకి వెళ్తుంది. కొంతమొత్తం జీర్ణం కాగా, ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికీ వెళ్తుంది. ఇక ఆల్కాహాల్‌లోని ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..