Smiling depression: ‘ఆ నవ్వు నిజం కాదు’.. పెరుగుతోన్న స్మైలింగ్ డిప్రెషన్..

|

Aug 13, 2024 | 10:12 PM

యటకు ఎంతో సంతోషంగా నవ్వుతున్న వారు లోలోపల ఏదో తెలియని ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనిని మానసికి నిపుణులు స్మైలింగ్ డిప్రెషన్‌గా అభివర్ణిస్తున్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో నవ్వే వ్యక్తులు స్మైలింగ్ డిప్రెషన్‌కు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. స్మైలింగ్ డిప్రెషన్ అనేది ఒక రకమైన డిప్రెషన్...

Smiling depression: ఆ నవ్వు నిజం కాదు.. పెరుగుతోన్న స్మైలింగ్ డిప్రెషన్..
Smiling Depression
Follow us on

మహేష్‌ బాబు ఓ సినిమాలో ఇంటర్వ్యూకి హాజరవుతారు అందులో.. ఇంటర్వ్యూ చేసే వారు మీది ఫేక్‌ స్మైల్‌ అని అంటారు. ఈ సీన్‌ మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే మనంలో చాలా మంది మనసులో ఎన్ని బాధలు ఉన్నా బయటకు నవ్వుతూ కనిపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే బయటకు నవ్వుతున్న వారంతా సంతోషంగా ఉన్నారని అర్థం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.

బయటకు ఎంతో సంతోషంగా నవ్వుతున్న వారు లోలోపల ఏదో తెలియని ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనిని మానసికి నిపుణులు స్మైలింగ్ డిప్రెషన్‌గా అభివర్ణిస్తున్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో నవ్వే వ్యక్తులు స్మైలింగ్ డిప్రెషన్‌కు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. స్మైలింగ్ డిప్రెషన్ అనేది ఒక రకమైన డిప్రెషన్, ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.

స్మైలింగ్ డిప్రెషన్‌ను గుర్తించడానికి ప్రత్యేకంగా ఎలాంటి పరీక్షల నిర్వహించాల్సిన అసవరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది వ్యక్తి ప్రవర్తను బట్టి బయటకు కనిపిస్తుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తుల ప్రవర్తనలో కనిపించే లక్షణాల ఆధారంగా స్మైలింగ్ డిప్రెషన్‌ను గుర్తిస్తారు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు తమ డిప్రెషన్‌ను దాచుకోవడానికి నవ్వును ఉపయోగిస్తారని చెబుతున్నారు. డిప్రెషన్‌తో ఇబ్బంది పడేవారు తమ నవ్వుతో అతను దానిని తన భావాలతో, నవ్వుతో ఆ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంటాడు.

బయటకు ఎంతో సంతోషంగా ఉన్నా లోలోపల నిరాశతో బాధపడుతుంటారు. ఈ స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడేవారి నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిత్యం తీవ్ర విచారం, నిరాశకు గురవుతారు. నిరంతరం అలసిపోయినట్లు ఉంటారు. ఇలాంటి వారు అభిరుచులపై ఆసక్తిని కోల్పోతారు. అయితే ఈ సమస్యను తక్కువ కాలంలో గుర్తిస్తే.. చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్మైలింగ్ డిప్రెషన్‌ను కాగ్నిటివ్ బిహేవియరల్ ట్రీట్‌మెంట్ (CBT) ద్వారా నయం చేయవచ్చు. ఒత్తిడిని తగ్గించే మందులు తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉండడం, నచ్చిన పనులు చేయడం ద్వారా ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడొచ్చు. అలాగే మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్ చేయండ..