Diabetes Diet: రోజు రోజుకీ బ్లడ్ షుగర్ పెరుగుతోందా ఈ 4 కూరగాయలను తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి

|

Aug 28, 2024 | 8:32 PM

మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. కొద్దిపాటి అజాగ్రత్త కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమని డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. మధుమేహ రోగులు తినే ఆహరంలో కొన్నిటిని చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. కనుక షుగర్‌ని అదుపులో ఉంచే అటువంటి కూరగాయల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Diabetes Diet: రోజు రోజుకీ బ్లడ్ షుగర్ పెరుగుతోందా ఈ 4 కూరగాయలను తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
Green Veggies In Diabetes
Follow us on

మధుమేహం క్రమంగా తీవ్రమైన సమస్యగా మారుతోంది. వృద్ధులే కాదు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి మధుమేహం బారిన పడితే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేమని, నియంత్రనే మార్గమని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో దీనిని నియంత్రించవచ్చని అంటున్నారు. అటువంటి పరిస్థితిలో షుగర్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. కొద్దిపాటి అజాగ్రత్త కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమని డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. మధుమేహ రోగులు తినే ఆహరంలో కొన్నిటిని చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. కనుక షుగర్‌ని అదుపులో ఉంచే అటువంటి కూరగాయల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కాకరకాయ

మధుమేహం ఉన్నవారు కాకరకాయ తినడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది షుగర్‌కి ఓ ఔషధం అనడంలో అతిశయోక్తి లేదు. కాకర కాయలో విటమిన్లు, మినరల్స్ అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకాలన్నీ షుగర్ నియంత్రణలో పనిచేస్తాయి. కనుక కాకరకాయను కూరగా లేదా జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్రోకలీ

బ్రోకలీ తినడం మధుమేహ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో క్రోమియం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

పాలకూర

పాలకూర ఐరన్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూర లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరం నుండి గ్లూకోజ్‌ను నెమ్మదిగా గ్రహిస్తుంది. దీనితో పాటు పాలకూర లో యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.

బెండకాయ

డయాబెటిక్ రోగులు బెండకాయ ను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించే కొన్ని మూలకాలు బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)