మట్టితో ఊబకాయం దూరం

| Edited By:

Mar 22, 2019 | 6:53 PM

గతంలో వంటలకు మట్టి పాత్రలను వాడేవారు. బంకమట్టితో తయారు చేసిన పాత్రలో ఆహారం తింటేనే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటే.. బంకమట్టినే తింటే ఎలా ఉంటారన్న విషయంపై ఎలుకల మీద ఓ అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజు కొద్ది మొత్తంలో బంకమట్టి తినడం ఆరోగ్యానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని సౌత్‌ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలంటున్నారు. అయితే పొట్ట తగ్గుతుంది కదాని బంకమట్టిని నేరుగా తినకూడదనీ, పరీక్ష చేసిన బంకమట్టిని మాత్రమే తినాలని వారు సూచిస్తున్నారు. పరిశోధకులు […]

మట్టితో ఊబకాయం దూరం
Follow us on

గతంలో వంటలకు మట్టి పాత్రలను వాడేవారు. బంకమట్టితో తయారు చేసిన పాత్రలో ఆహారం తింటేనే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటే.. బంకమట్టినే తింటే ఎలా ఉంటారన్న విషయంపై ఎలుకల మీద ఓ అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజు కొద్ది మొత్తంలో బంకమట్టి తినడం ఆరోగ్యానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని సౌత్‌ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలంటున్నారు. అయితే పొట్ట తగ్గుతుంది కదాని బంకమట్టిని నేరుగా తినకూడదనీ, పరీక్ష చేసిన బంకమట్టిని మాత్రమే తినాలని వారు సూచిస్తున్నారు.

పరిశోధకులు కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, మరికొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్‌ బంక మట్టిని ఆహారంగా ఇచ్చారు. ఇలా రెండు వారాల అనంతరం మట్టిని తిన్న ఎలుకల్లో బరువు తగ్గడం గుర్తించారు. బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తుందనీ, అయితే ఇది మనుషుల మీద ఎంత ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి మరిన్ని ప్రయోగాలు అవసరమని వారు చెబుతున్నారు. మట్టిని నేరుగా తినకపోయినా, మట్టి పాత్రలలో తయారు చేసిన ఆహారాన్ని తింటే అధిక‌ బరువు నుంచి తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.