మహిళలు వెంటనే బరువు తగ్గడం, పెరగడం మంచిదేనా..?

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:58 PM

ప్రస్తుతం ఉన్న జీవనశైలి ప్రకారం అందరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆ బరువును తగ్గించుకోవడం కోసం వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్‌ను ఎంచుకుంటున్నారు. కానీ.. వెంటనే బరువుపెరడగం, వెంటనే బరువు తగ్గడమనేది పలు రకాలైన ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుందని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ.. ఎక్కువగా మహిళలు ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని కొన్ని సర్వేల్లో తేలింది. అయితే.. తాజాగా ప్రత్యేకంగా మహిళలపై కొలంబియా యూనివర్శిటీకి చెందిన వారు పరిశోధనలు చేశారు. దాదాపు 500 మంది మహిళలపై పరిశోధనలు […]

మహిళలు వెంటనే బరువు తగ్గడం, పెరగడం మంచిదేనా..?
Follow us on

ప్రస్తుతం ఉన్న జీవనశైలి ప్రకారం అందరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆ బరువును తగ్గించుకోవడం కోసం వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్‌ను ఎంచుకుంటున్నారు. కానీ.. వెంటనే బరువుపెరడగం, వెంటనే బరువు తగ్గడమనేది పలు రకాలైన ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుందని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ.. ఎక్కువగా మహిళలు ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని కొన్ని సర్వేల్లో తేలింది.

అయితే.. తాజాగా ప్రత్యేకంగా మహిళలపై కొలంబియా యూనివర్శిటీకి చెందిన వారు పరిశోధనలు చేశారు. దాదాపు 500 మంది మహిళలపై పరిశోధనలు చేశారు. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు పరిశోధకులు. ఒక సంవత్సరంలోపు 10 పౌండ్లును (10 కేజీలు) బరువును తగ్గించుకోవడం గుండెపోటుకు గురిచేస్తుందని రీసెర్చ్‌లో తేలిందన్నారు.

నిజానికి, నిలకడ మీ హృదయానికి చాలా మంచిదని తెలిపారు. ఆరోగ్యకరమైన బరువును పొందడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు. బరువు తగ్గుదల విషయంలో ఆడవారు సమస్యలను గురిచేస్తుందని అన్నారు పరిశోధకులు. గర్భం దాల్చే విషయంలో కూడా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొనవలసి వస్తుందని సూచించారు. అలాగే.. గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు.

సాధారణంగా గర్భస్రావం సమస్య ఉన్న మహిళలు బహుశా చిన్నవయస్సులో వారికి వివాహం అయి ఉన్న వారై ఉంటారని డాక్టర్ అగర్వాల్ అన్నారు. కానీ బరువు నియంత్రణ, తగ్గుదలలో కూడా ఈ సమస్యలు కనిపిస్తాయని వెల్లడించారు. మహిళలు రోలింగ్-కోస్టర్ ఆహారాన్ని ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో..? అలాగే వారి గుండె పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి మేము వారిని జీవితకాలం పరిశీలించవలసి ఉంటుందని పేర్కొన్నారు.

లైఫ్ సింపుల్స్ 7లో 7 రకాలపై యో యో ఆహారపదార్థం ఎంత ప్రభావం కలిగి ఉంటుందో స్పష్టంగా కాలేదు. లైఫ్ సింపుల్స్ 7ను పాటించని వారు తక్కువ బరువును కలిగి ఉండటంతో పాటు వారు యోయో ఆహార పదార్థాలను మరింత తరచుగా ఎదుర్కొవడం కష్టమవుతుందన్నారు.

కాగా.. డాక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ.. మేము అధ్యయనం చేసిన దాని ప్రకారం యోయో ఆహార వ్యవస్థను పాటించి బరువును పెరగడం, కోల్పోయే వారు ఎక్కువగా 37 సంవత్సరాల వయస్సున్న వారని చెప్పారు. ఇది వారిని రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. వారు ఎంచుకునే ఆహారం చాలా అధ్వాన్నంగా ఉందని వారు పరిశోధకులు తెలిపారు.