Weight Loss: ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటే చాలు.. బరువు తగ్గడం చాలా సులభం.

|

Nov 20, 2023 | 2:01 PM

ఎన్నో పోషకాలకు బిర్యానీ ఆకు నెలవు. బరువు తగ్గడంలో కూడా బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. బిర్యానీ ఆకులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, కాల్షియం, సెలీనియం, ఐరన్‌, కాపర్‌, పొటాషియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి పోషకాలు ఉండే బిర్యానీ ఆకుతో టీ చేసుకొని తాగితే ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని క్రమం తప్పకుండా...

Weight Loss: ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటే చాలు.. బరువు తగ్గడం చాలా సులభం.
Weight Loss
Follow us on

ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే పదార్థాల్లో బిర్యానీ ఆకు ఒకటి. అయితే బిర్యానీ ఆకు అనగానే కేవలం బిర్యానీ రైస్‌ కోసం మాత్రం ఉపయోగించేది అనుకుంటాం. అయితే బిర్యానీ ఆకును ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా.?

ఎన్నో పోషకాలకు బిర్యానీ ఆకు నెలవు. బరువు తగ్గడంలో కూడా బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. బిర్యానీ ఆకులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, కాల్షియం, సెలీనియం, ఐరన్‌, కాపర్‌, పొటాషియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి పోషకాలు ఉండే బిర్యానీ ఆకుతో టీ చేసుకొని తాగితే ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తాగడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బిర్యానీ ఆకులతో చేసిన టీని తాగడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగువుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది. బిర్యానీ ఆకులోని ప్రోటీన్లు, ఫైబర్‌లు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇక ఈ టీలో దాల్చిన చెక్ను కలుపుకొని తీసుకుంటే శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాదండోయ్‌ బిర్యానీ టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియ్ గుణాలు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. బిర్యానీ ఆకులోని పొటాషియం, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. అంతేకాదు బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగితే డయాబెటిస్‌ కూడా అదుపులో ఉంటుంది.

ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాలంటే..

ఇందుకోసం ముందుగా మూడు బిర్యానీ ఆకులను తీసుకోవాలి. అనంతరం ఒక పాత్రను తీసుకొని అందులో కొంత నీరు పోసుకోవాలి. ఆ నీటిలో బిర్యానీ ఆకులను, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి గ్లాసులోకి తీసుకోవాలి. చివరిగా అందులో తేనెతో పాటు నిమ్మరసం కలుపుకుంటే చాలు బిర్యానీ ఆకు టీ తయారవుతుంది. తేనె, నిమ్మరసం వేసుకోవడం వల్ల టీకి రుచి కూడా పెరుగుతుంది.