వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..

తమలపాకు కేవలం సంప్రదాయానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధం. జీర్ణక్రియ మెరుగుపరచడం, దగ్గు-జలుబు నుంచి ఉపశమనం, నోటి ఆరోగ్యం, నొప్పుల నివారణ, గాయాల మాన్పు, బరువు నియంత్రణ, శరీరంలోని టాక్సిన్స్ తొలగింపు వంటి అనేక ప్రయోజనాలు తమలపాకులో దాగి ఉన్నాయి. అయితే పొగాకు, సున్నంతో కాకుండా సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..
Betel Leaf Benefits

Updated on: Aug 01, 2026 | 8:51 PM

తమలపాకు.. భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. కేవలం ఒక సాంప్రదాయ ఆకు మాత్రమే కాదు.. తమలపాకులో అనేక శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, నోటి దుర్వాసనను తగ్గించడం.. వాపులను నివారించడంలో సహాయపడుతుందని.. మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

తమలపాకు అందించే ఏడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను.. వాటిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకోండి.

శ్వాసకోశ ఆరోగ్యానికి..

వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు తమలపాకు అద్భుతమైన పరిష్కారం. ఇది ఒక సహజసిద్ధమైన ఎక్స్పెక్టరెంట్‌గా పనిచేసి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన చిక్కటి శ్లేష్మాన్ని పలుచబరుస్తుంది. రెండు తమలపాకులు, ఒక అంగుళం అల్లం, రెండు మూడు లవంగాలు, ఒకటిన్నర కప్పు నీటిని కలిపి మరిగించి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న పిల్లల కోసం, తమలపాకుపై నెయ్యి లేదా ఆవాల నూనె పూసి వేడి చేసి ఛాతీపై ఉంచడం వల్ల శ్వాస సులభతరం అవుతుంది.

నొప్పుల నివారణ (Pain Relief)

తమలపాకులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. తమలపాకు పేస్ట్‌ను కొద్దిగా వేడిచేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ లేదా ఒత్తిడి వల్ల తలనొప్పి వచ్చినప్పుడు నుదుటిపై తమలపాకు పేస్ట్‌ను రాయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

తమలపాకు జీర్ణవ్యవస్థను సహజంగా ఉత్తేజపరుస్తుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకును నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు యాక్టివేట్ అయ్యి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. అసిడిటీ, బ్లోటింగ్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గట్ హెల్త్‌ను మెరుగుపరచి, బోవెల్ మూవ్‌మెంట్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

తమలపాకులో ఉండే యాంటీబాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది దంతాల నొప్పి, చిగుళ్ల సమస్యలు, నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలోని ఆస్ట్రింజెంట్ గుణాలు చిగుళ్లను దృఢంగా ఉంచి దంతాలు వదులుగా అవ్వకుండా కాపాడతాయి. పూర్వకాలంలో తమలపాకును టూత్‌పేస్ట్ వలె ఉపయోగించేవారు.

చిన్న గాయాలను నయం చేస్తుంది

తమలపాకు సహజసిద్ధమైన యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. శరీరంలో చిన్న గాయాలు లేదా కోతలు ఏర్పడినప్పుడు, తమలపాకు పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది.. గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీబాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు హీలింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తాయి.

బరువు నియంత్రణకు సహాయపడుతుంది

సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలనుకునే వారికి తమలపాకు ఒక మంచి ఎంపిక. ఇది మెటబాలిక్ రేటును పెంచుతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది. సరైన ఆహారం, వ్యాయామంతో పాటు తమలపాకును తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

డిటాక్సిఫికేషన్‌కు మద్దతు

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో తమలపాకు కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే డైయూరిటిక్ ప్రాపర్టీస్ మూత్ర విసర్జనను పెంచుతాయి. తద్వారా శరీరంలోని అధిక నీరు, టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు తొలగిపోతాయి. తమలపాకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం ద్వారా డిటాక్స్ వాటర్‌గా ఉపయోగించవచ్చు.

తమలపాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ, పొగాకు లేదా సున్నం వంటి హానికరమైన పదార్థాలతో కలిపి దీనిని ఉపయోగించరాదు. ఇది ఎటువంటి ప్రయోజనాలను అందించదు సరికదా, ఆరోగ్యానికి హానికరం. ఈ అద్భుతమైన ఆకును సరైన పద్ధతిలో ఉపయోగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.. అయితే.. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us