ఆ పాత మధురం అంటోన్న నేటి తరం.. రాగి, ఇత్తడి పాత్రల్లో వంట.. ఏది ఆరోగ్యానికి మంచి ఎంపికో తెలుసా..

Updated on: Sep 20, 2025 | 11:52 AM

భారతీయ ఇళ్లలో వంట కోసం రాగి , ఇత్తడితో సహా అనేక రకాల పాత్రలను ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు లోహాలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. రాగి, ఇత్తడి పాత్రలను ఒకప్పుడు బాగా ఉపయోగించేవారు. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా వాటి స్థానంలో సత్తు .. తరవాత నాన్-స్టిక్ పాత్రలు వచ్చాయి. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా.. మళ్ళీ ఆ పాత మధురం అంటూ కొంతమంది ఇప్పుడు రాగి, ఇత్తడి పాత్రలకు తిరిగి వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు వంట చేయడానికి రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు ఏవి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయో తెలుసుకుందాం.

1 / 8
మనం వంట చేసే పాత్రల విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. భారతీయులు ఉక్కు, ఇనుము, ఇత్తడి, రాగి , అల్యూమినియం, మట్టి వంటి పాత్రలను సాధారణంగా ఉపయోగిస్తారు. ఈ పాత్రలలో వంట చేయడం వల్ల ఆహారం రుచి, పోషక విలువలు ప్రభావితమవుతాయి. సరైన పాత్రలను ఎంచుకోవడం వల్ల ఆహారంలోని పోషక విలువలు మరింత పెరుగుతాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ రోజుల్లో వివిధ రకాల వంట పాత్రలు వంట గదిలో సందడి చేస్తున్నాయి. అయితే అవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపే లోహాలతో తయారు చేయబడుతున్నాయి. కనుక వంట చేసే విషయంలో జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో మళ్ళీ పూర్వకాలం అలవాట్ల వైపు మనిషి పయనిస్తున్నాడు. అందులో భాగంగా రాగి, ఇత్తడి పాత్రల్లో వంట చేయడం మొదలు పెట్టారు.

2 / 8
రాగి, ఇత్తడి అనే రెండు లోహాలను ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. పురాతన కాలంలో ఆహారాన్ని రాగి పాత్రలలో వండేవారు. అయితే నేటికీ చాలా మంది తమ వంటశాలలలో రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. రాగి పాత్రలలో వంట చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు బాగా గ్రహించబడతాయని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. ఇత్తడి కూడా అనేక వంటశాలలలో ఒక భాగం. ఇత్తడి పాత్రల్లో వంట చేయడం ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ రెండు పాత్రలలో ఏది వంటకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?  ఈ రోజు తెలుసుకుందాం

3 / 8
రాగి, ఇత్తడి అనే రెండు లోహాలను ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. పురాతన కాలంలో ఆహారాన్ని రాగి పాత్రలలో వండేవారు. అయితే నేటికీ చాలా మంది తమ వంటశాలలలో రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. రాగి పాత్రలలో వంట చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు బాగా గ్రహించబడతాయని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు.

4 / 8
 ఇత్తడి కూడా అనేక వంటశాలలలో ఒక భాగం. ఇత్తడి పాత్రల్లో వంట చేయడం ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ రెండు పాత్రలలో ఏది వంటకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?  ఈ రోజు తెలుసుకుందాం..

5 / 8
రాగి పాత్రలలో వంట: రాగిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఇంకా రాగి ఇనుము లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలలో వంట చేయడం లేదా తినడం కూడా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. ముఖ్యంగా రాగి పాత్రలలో ఆహారం వేగంగా ఉడకుతుంది. మాడిపోయే అవకాశం తక్కువ. ఈ పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు సంరక్షించబడతాయి. ఈ ప్రయోజనాలతో పాటు.. రాగి పాత్రలో చేసే ఆహారం రుచిని కూడా పెంచుతుంది.

6 / 8
ఇత్తడి పాత్రతో ఆహారం: కొన్ని ఇళ్లలో ఇత్తడి పాత్రలను వంట చేయడానికి ఉపయోగిస్తారు. ఇత్తడి పాత్రలలో వంట చేయడం వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఇత్తడిలో జింక్ ఉంటుంది. కనుక ఇత్తడి పాత్రలలో వంట చేయడం వలన జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది. ఇంకా ఇత్తడి పాత్రలలో వంట చేయడం, తినడం రెండూ ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆహారంలోని పోషకాలను సంరక్షిస్తుంది.

7 / 8

నిపుణులు ఏమంటున్నారంటే.. ఈ విషయంపై ఆయుర్వేద నిపుణురాలు కిరణ్ గుప్తా స్పందిస్తూ.. ఇత్తడి పాత్రలను జాగ్రత్తగా వాడాలని సలహా ఇస్తున్నారు. ఇత్తడి పాత్రలలో గ్రేవీలు లేదా పుల్లని కూరగాయలను వండకూడదని చెప్పారు. అంతేకాదు ఇత్తడి పాత్రను కొనుగోలు చేసేటప్పుడు.. ఆహారం పోషక విలువలను కాపాడటానికి ఆ పాత్రల్లోని తేలికపాటి వెండి పూత ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

8 / 8
రాగి లేదా ఇత్తడి, దేనిలో వండటం మంచిది: రెండు పాత్రలకు వాటి సొంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. రాగి పాత్రలో వంట త్వరగా అవుతుంది. ఆహారం రుచికరంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇత్తడిలో వంట చేయడం వల్ల ఆహారం పోషక విలువలు తగ్గవు. ఇత్తడి పత్రాలు మన్నికైనవి కూడా. ధర పరంగా.. రాగి.. ఇత్తడి కంటే కొంచెం ఖరీదైనది. అయితే రెండు పాత్రలలో పుల్లని ఆహారాన్ని వండటం సిఫారసు చేయబడలేదు. ఎందుకంటే ఇది ప్రతిచర్యకు కారణమవుతుంది. కనుక అవసరాలకు సరిపోయే పాత్రను ఎంచుకుని వంట చేసుకోవడం వలన ప్రయోజనాలు ఉంటాయి.