Walking: రోజు 10వేల అడుగులు నడవండి.. ఎన్ని మార్పులు జరుగుతాయో గమనించండి

|

May 13, 2024 | 7:10 AM

ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు వాకింగ్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సైతం బయటపడొచ్చని సూచిస్తుంటారు. అయితే ఎంత సేపు వాకింగ్ చేయాలి.? ఎంత దూరం నడవాలి.? అనే అనేక రకాల ఆలోచనలను మనకు రావడం సర్వసాధారణం...

Walking: రోజు 10వేల అడుగులు నడవండి.. ఎన్ని మార్పులు జరుగుతాయో గమనించండి
Walking
Follow us on

ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు వాకింగ్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సైతం బయటపడొచ్చని సూచిస్తుంటారు. అయితే ఎంత సేపు వాకింగ్ చేయాలి.? ఎంత దూరం నడవాలి.? అనే అనేక రకాల ఆలోచనలను మనకు రావడం సర్వసాధారణం. నిపుణులు అభిప్రాయం ప్రకారం రోజుకు 10వేల అడుగులు నడిస్తే చాలు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మరి రోజుకు 10వేల అడుగులు నడిస్తే శరీరంలో జరిగే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రెగ్యులర్ వాకింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఎక్కువ ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. జర్నల్ ఆఫ్ కార్డియోపల్మోనరీ రిహాబిలిటేషన్ అండ్ ప్రివెన్షన్‌లో ఈ విషయాలను పబ్లిష్‌ చేశారు. నడక శ్వాసకోశ కండరాలను బలపరుస్తుంది, వెంటిలేషన్‌ను మెరుగుపరుస్తుంది, మొత్తం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

* గుండె ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్ఆనరు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన పరిశోధన ప్రకారం రోజుకు కనీసం 10,000 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50% వరకు తగ్గుతుందని తేలింది. రెగ్యులర్ వాకింగ్ రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇవన్నీ ఆరోగ్యకరమైన గుండెకు దోహదం చేస్తాయి.

* స్ట్రోక్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 10,000 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడిచే స్త్రీలలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గినట్లు తెలిపారు. ఇందుకోసం పరిశోధకులు ఒక దశాబ్దం పాటు 13,000 మంది మహిళలను పరిగణలోకి తీసుకొని పరిశోధనలు చేపట్టారు. ఎక్కువ నడిచే వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం 21% తక్కువగా ఉందని కనుగొన్నారు. నడక ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అలాగే ధమనులలో ఫలకం పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది, ఇవన్నీ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.

* టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని సైతం వాకింగ్ చెక్‌ పెడుతుందని నిపుణులు అంటున్నారు. డయాబెటోలోజియా జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. పరిశోధకులు 10 సంవత్సరాల పాటు 2,000 మంది వ్యక్తులపై పరిశోధనలు చేపట్టి ఈ విషయాన్ని తెలిపారు. వాకింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

* ఇక నడక మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు కేవలం 10 నిమిషాలు నడవడం నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గుతాయని తెలిపారు. నడక ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఇవి సహజ మూడ్ లిఫ్టర్‌లుగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తాయి.

* వాకింగ్ నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్‌లో ప్రచురించి అధ్యయనం ప్రకారం.. వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు సుమారు 10,000 అడుగులు) నడిచే పెద్దలు మెరుగైన నిద్రను పొందుతున్నారని తేలింది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..