
సాధారణంగా ఇంట్లో పిండి వంటలు పండగలు, ఇతర శుభకార్యల సమయంలో మాత్రమే చేస్తారు. కానీ పిల్లలు ప్రతిసారి సాయంత్రం స్నాక్స్ కావాలని అడుగుతారు. అలాంటప్పుడూ బయట కల్తీ పదార్థాలతో చేసే స్నాక్స్ కాకుండా.. ఇంట్లోనే మనం చిన్నుడు ఎంతో ఇష్టంగా తినే పప్పు చెగోడీలు చేసి ఇస్తే వారు ఎంతో ఇష్టంగా తింటారు. మరీ వీటిని బయట బడ్డీ కొట్లల్లో, బేకరీల్లో దొరికే రుచితో ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, ఆరోగ్యకరంగా తయారుచేసుకోవచ్చో ఇక్కడ స్టెప్ బైట స్టెప్ చూద్దాం.
పప్పు చకోడీల తయారీకి కావాల్సిన పదార్థాలు:
పప్పు చకోడీల తయారీ విధానం:
స్టెప్-1: ముందుగా శనగపప్పును నీళ్లలో కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత పప్పును శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా వడగట్టాలి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్‌పై వేసి ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఆరబెట్టాలి. తర్వాత ఒక పళ్లెంలో 2 కప్పుల పొడి బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు, కారం, వాము పొడి, పసుపు, ఇంగువ, నెయ్యి, చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలపాలి. తర్వాత మంటను లోప్లేమ్‌లో పెట్టి. జల్లించిన పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. పిండి అంతా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆపి, మూత పెట్టి గోరువెచ్చగా చల్లారనివ్వాలి.
స్టెప్-3: పిండి కాస్త చల్లారాక చేత్తో బాగా నలుపుతూ స్మూత్‌గా అయ్యేంత వరకు కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే పప్పు అంటుకోదు, మరీ పల్చగా ఉంటే నూనె పీల్చేస్తుంది. కాబట్టి సెమీ సాఫ్ట్‌గా కలుపుకుని ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి. కలిపిన పిండిలోంచి చిన్న ముద్దలు తీసుకుని సన్నగా, పొడవుగా ఒత్తాలి. దానికి ఆరబెట్టిన శనగపప్పును అంటించి గుండ్రంగా చెగోడీల ఆకారంలో చుట్టాలి. అన్ని చెగోడీలను ఒకే మందంతో చుట్టి కాసేపు ఆరనిస్తే, వేయించేటప్పుడు పప్పు విడిపోకుండా ఉంటుంది.
స్టెప్-4: ఇప్పుడు కడాయిలో నూనె పోసి హై ఫ్లేమ్‌లో బాగా వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత చెగోడీలను కడాయి నిండుగా కాకుండా కాస్త గ్యాప్ ఉండేలా వేయాలి. అవి వాటంతట అవే నూనె పైకి తేలే వరకు హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి. పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. నూనెలో నురగ పూర్తిగా తగ్గిపోయిందంటే చెగోడీలు లోపల వరకు కరకరలాడుతూ వేగినట్లే. తర్వాతి బ్యాచ్ వేసే ముందు నూనెను మళ్లీ హై ఫ్లేమ్‌లో వేడి చేసి ఇదే విధంగా వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే మీ పప్పు చకోడీలు రెడీ.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.