ఇది ఎవ్వరికీ తెలీదు.. చికెన్ కర్రీ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ముక్క కూడా మిగలదు!

చికెన్ కర్రీ వండినప్పుడు నీచు వాసన వస్తోందా? అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చు. చికెన్‌ను శుభ్రం చేయడం నుంచి మసాలాలు పట్టించడం, ఉల్లిపాయలు వేయించడం, పెరుగు కలపడం వరకు సరైన పద్ధతులు పాటిస్తే ఇంట్లోనే గుమగుమలాడే చికెన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఇది ఎవ్వరికీ తెలీదు.. చికెన్ కర్రీ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ముక్క కూడా మిగలదు!
Chicken Curry Recipe,

Updated on: Nov 15, 2026 | 12:36 PM

వీకెండ్ వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు మంచిగా చికెన్, మటన్ లాంటివి కొని తెచ్చుకుంటారు.. కర్రీ లేదా ఫ్రై ఇంకా.. పలు రకాలుగా వండుకుని తింటారు. అయితే, చాలామంది చికెన్ ను ఇష్టంగా తింటారు. ఎందుకంటే చికెన్ అందుబాటు ధరలో ఉంటుంది.. కావున, ఎక్కువగా కొడి మాంసానికే ప్రధాన్యం ఇస్తారు. అయితే.. కోడి మాంసం అందరూ వండుతారు కానీ.. చాలా సందర్భాల్లో కర్రీ నీచు వాసన వస్తుంటుంది. అలాంటి వారు చికెన్ కర్రీని నీచు వాసన రాకుండా.. ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ టిప్స్ పాటించడం ద్వారా.. ఎలాంటి క్లిష్టమైన మసాలాలు లేకుండా, ఎంతో సులభంగా, రుచికరంగా చికెన్ కర్రీని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు..

సింపుల్‌గా చికెన్ కర్రీ రెసిపీ తయారీ విధానం

నీచు వాసన రాకుండా ఉండటానికి:

ముందుగా చికెన్‌ను తీసుకుని, ముక్కలకు కొద్దిగా ఉప్పు, పసుపు పట్టించి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి నీరంతా వంపేయడం వల్ల చికెన్‌లో ఉండే నీచు వాసన పూర్తిగా పోతుంది.

మసాలాలు పట్టించడం: కడిగిన చికెన్‌లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి 10-15 నిమిషాలు పక్కన ఉంచాలి. దీనివల్ల ముక్కలు చప్పగా ఉండకుండా ఉప్పు, కారం బాగా పడతాయి.

పోపు – ఉల్లిపాయల వేపుడు: పాన్‌లో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అందులోనే ఫ్రెష్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.

చికెన్ ఉడికించడం: మసాలా మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్‌లో 2-3 నిమిషాలు కలపాలి. ఆ తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. గ్రేవీ కోసం కొద్దిగా పెరుగును బాగా కలిపి వేసుకోవాలి (ఫ్రై కావాలంటే పెరుగును స్కిప్ చేయవచ్చు)..

నీరు చేర్చి ఉడికించడం: మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 4-5 నిమిషాలు ఉడికించిన తర్వాత, గ్రేవీకి సరిపడా నీరు పోసి మీడియం మంటపై చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి.. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే.. గుమగుమలాడే రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అవుతుంది..

ఈ చికెన్ కర్రీ రోటీ అలాగే.. అన్నం, బగారాలోకి అద్భుతంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us