ఘాటైన రుచే కాదు..దివ్య ఔషధం మిరియాలు

|

Aug 21, 2019 | 12:23 PM

నిత్యం ఉరుకులు, పరుగుల జీవితం. హెల్త్‌ గురించి శ్రద్ధ తీసుకునే సమయమే ఉండదు. ఐతే  చిన్న చిన్న చిట్కాలను పాటించి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చు. ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే పోపులపెట్టెలోనే ఉంది. ఆహారంలో రుచిని పెంచేందుకు ఉపయోగించే మిరియాలే దివ్య ఔషధంలా పనిచేస్తాయి.  వీటిని క్వీన్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఈ నల్ల మిరియాలకు ప్రత్యేక స్థానముంది. వీటిని మనం రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే పలు […]

ఘాటైన రుచే కాదు..దివ్య ఔషధం మిరియాలు
Follow us on

నిత్యం ఉరుకులు, పరుగుల జీవితం. హెల్త్‌ గురించి శ్రద్ధ తీసుకునే సమయమే ఉండదు. ఐతే  చిన్న చిన్న చిట్కాలను పాటించి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చు. ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే పోపులపెట్టెలోనే ఉంది. ఆహారంలో రుచిని పెంచేందుకు ఉపయోగించే మిరియాలే దివ్య ఔషధంలా పనిచేస్తాయి.  వీటిని క్వీన్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఈ నల్ల మిరియాలకు ప్రత్యేక స్థానముంది. వీటిని మనం రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే పలు అనారోగ్యాలకు చెక్‌ పెట్టొచ్చు. మిరియాలలో ఉండే పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధులను దూరం చేస్తాయి.

మిరియాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
*    మిరియాల పొట్టుతో కట్టుకడితే తలనొప్పి తగ్గుతుంది.
*    గొంతులో కఫం, జలుబు, దగ్గు, తుమ్ములు వంటిని దూరం చేస్తాయి.
*   కండరాలు, నరాల నొప్పులు, వాపులు దూరమవుతాయి.
*     చిగుళ్ల వాపు తగ్గుతుంది, నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టొచ్చు.
*    చర్మ అలర్జీ సమస్యలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి.
*    జుట్టు రాలిపోవడాన్ని, చుండ్రును అరికట్టి ఎదుగుదలకు దోహదం చేస్తాయి.
*   బరువు తగ్గాలనుకునేవారికి ఇవి దివ్య ఔషధంలా పనిచేస్తాయి.
*    అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా  చేస్తాయి.
*   రొమ్ము క్యాన్సర్‌, పెద్ద పేగు నివారణకు మిరియాలు బాగా సహకరిస్తాయి.
*   ఆకలి పెంచుతాయి, పైపెరైన్‌ ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తాయి.
*  రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ధన్వంతరి అని కూడా పిలిచే మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. వంటలకు ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు వైద్యులు.