Teeth Health: ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి..

|

Jun 30, 2024 | 10:09 PM

నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో అలోవెరా జెల్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్‌తో చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగువుతుందని మనందరికీ తెలిసిదే. అయితే దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో అలోవెరా జెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నోటి బ్యాక్టీరియాను నాశనం చేసి చిగుళ్ల సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు...

Teeth Health: ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి..
Aloe Vera For Teeth
Follow us on

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో పరిశుభ్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. ముఖ్యంగా నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. దీని కోసమే చాలా మంది మార్కెట్లో లభించే రకరకాల టూత్ పేస్ట్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే కొందరికి ఎన్ని రకాల బ్రాండ్స్‌ టూత్‌ పేస్ట్‌లను ఉపయోగించినా ఫలితం మాత్రం ఉండదు. అలాంటి వారికి కలబద్ద ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? ఇంతకీ నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కలబంద ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో అలోవెరా జెల్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్‌తో చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగువుతుందని మనందరికీ తెలిసిదే. అయితే దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో అలోవెరా జెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నోటి బ్యాక్టీరియాను నాశనం చేసి చిగుళ్ల సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ జెల్‌ను టూత్ పేస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.

అలోవెరా జెల్‌ను టూత్‌ పేస్ట్‌గా వాడితే నోటిని శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది. అంతేకాదు నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి కూడా అలోవెరా జెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి దుర్వాస సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అలాగే నోరు కూడా రిఫ్రెష్‌ అవుతుంది. చిగుళ్ల నుంచి రక్తం వచ్చే వారికి, చిగుళ్లు ఉబ్బిన వారికి కూడా అలోవెరా జెల్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.

అలోవేరాలో ఉండే ఔషధ గుణాలు, విటమిన్స్‌, మినరల్స్‌ దంతాలను బలంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. ఇంతకీ కలబందను ఎలా ఉపయోగించాలనేగా మీ సందేహం. ఏం లేదండి.. కలబంద ఆకును తొలచి అందులోని జెల్‌ను బయటకు తీయాలి. అనంతరం బ్రస్‌పై కొద్ది మొత్తంలో అలోవెరా జెల్‌ను అప్లై చేస్తే సరిపోతుతుంది. సాధారణంగా బ్రష్‌ లాగా చేసుకోవాలి. ప్రతీరోజూ రెండు సార్లు ఇలా చేస్తే దంత సమస్యల నుంచి బయటపడొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..