Vastu: మేడపై ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా చాలా నష్టపోతారు..

|

Aug 11, 2024 | 8:59 PM

వాస్తు అనగానే మనం కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ వాస్తు అనేది ఒక్క ఇంటి నిర్మాణంతోనే ఆగిపోదు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఏ దిశలో ఉండాల్సిన వస్తువులు ఆ దిశలో ఉంటేనే బాగుంటుందని చెబుతున్నారు...

Vastu: మేడపై ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా చాలా నష్టపోతారు..
Vastu
Follow us on

వాస్తు అనగానే మనం కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ వాస్తు అనేది ఒక్క ఇంటి నిర్మాణంతోనే ఆగిపోదు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఏ దిశలో ఉండాల్సిన వస్తువులు ఆ దిశలో ఉంటేనే బాగుంటుందని చెబుతున్నారు. దానికి విరుద్దంగా ఉంటే ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు.

అయితే మనలో మనలో చాలా మంది ఇంటి లోపల వస్తువుల వరకు మాత్రమే ఇలాంటి వాస్తు నియమాలను పాటిస్తుంటారు. బీరువా పలానా దిశలో ఉండాలి, టీవీ పలానా దిశలో ఉంటే సరిపోతుందని అనుకుంటాం. అయితే ఇంట్లోనే కాదు మేడపై ఉండే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు ఉంటాయని అంటున్నారు. ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఇంటి మేడపై కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ మేడపై పెట్టే వస్తువుల విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* మనలో చాలా మంది ఇంటి నిర్మాణానికి ఉపయోగించే కర్రలను.. ఇంటి నిర్మాణం పూర్తికాగానే మేడపై ఉండే ఖాళీ ప్రదేశంలో పెడుతుంటాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి మేడపై వెదురు కర్రలు ఉండకూడదు. ఇలా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

* ఇక చాలా మంది ఇంట్లో ఉపయోగకరంగా లేని, విరిగిన ఫర్నిచర్‌ను కూడా మేడపై పడేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక మేడపై కామన్‌గా కనిపించే వాటిలో పగిలిన కుండలు కూడా ముఖ్యమైనవి. అయితే పగిలిన కుండలను అస్సలు మేడపై ఉండకూదదు. అలాగే విరిగిన కుండల్లో మొక్కలను కూడా పెంచకూడదు. వీటి వల్ల అశాంతి పెరుగుతుంది.

* ఇంటి మేడపై చీపురుకట్టలను కూడా పడేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

* తుప్పు పట్టిన లోహాలను కూడా ఇంటి మేడపై పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మేడపై వైర్లు, తుప్పు పట్టిన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయి.

* ఇక మేడపై మొక్కలు పెంచడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. అయితే టెర్రస్‌పై ఏర్పాటు చేసే మొక్కల్లో ముళ్లు ఉండే మొక్కలను నాటకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..