BP: బీపీతో ఊగిపోతున్నారా? వెంటనే కంట్రోల్‌కి తీసుకొచ్చే సింపుల్ టిప్

|

Sep 09, 2024 | 7:41 PM

వ్యాయామాలు అనగానే వాకింగ్, జాగింగ్‌ వంటివే గుర్తొస్తాయి. అయితే గోడ కుర్చీ వేయడం వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఐసోమెట్రిక్ వ్యాయామంగా చెబుతుంటారు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు పనిష్మెంట్‌గా వేసే గోడ కుర్చీ వేయడం ద్వారా బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు...

BP: బీపీతో ఊగిపోతున్నారా? వెంటనే కంట్రోల్‌కి తీసుకొచ్చే సింపుల్ టిప్
High Bp
Follow us on

ఒత్తిడితో కూడుకున్న జీవితం, మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల బీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెరిగిన బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. హృదయ సంబంధిత సమస్యలకు బీపీ కారణమని నిపుణులు చెబుతుంటారు. ఇక బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే తీసుకునే ఆహారంలో మార్పులతో పాటు, వ్యాయామాలు సైతం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు.

వ్యాయామాలు అనగానే వాకింగ్, జాగింగ్‌ వంటివే గుర్తొస్తాయి. అయితే గోడ కుర్చీ వేయడం వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఐసోమెట్రిక్ వ్యాయామంగా చెబుతుంటారు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు పనిష్మెంట్‌గా వేసే గోడ కుర్చీ వేయడం ద్వారా బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఏరోబిక్‌ వ్యాయామాల కంటే ప్లాంక్‌, స్క్వాట్స్‌ కారణంగా శరీరంపై విభిన్నమైన ఒత్తిడి కలుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది.

రెండు నిమిషాల సేపు ఈ భంగిమలో ఉండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ఈ భంగిమ నుంచి రిలాక్స్‌ అయిన వెంటనే ఒక్కసారిగా రక్త ప్రసరణ అవుతుంది. ఇక కండరాలు బిగుతుగా, బలంగా మారడంలో కూడా ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. రన్నింగ్, సైక్లింగ్ వంటి ఇతర రకాల కార్డియోల కంటే.. రక్తపోటును తగ్గించడంలో గోడ కుర్చీ వేయడం మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుతో బాధపడేవారు వారంలో మూడు సార్లు చేస్తే మార్పు గమనించవచ్చని చెబుతున్నారు.

పరిశోధనల ప్రకారం ఇలా చేయడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు 10 mmHg, డయాస్టోలిక్ ఒత్తిడిని 5 mmHg తగ్గించిందని తేలింది. ఇదే విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు సుధీర్‌ కుమార్‌ ఇదే విషయాన్ని తెలిపారు. బీపీ కంట్రోల్‌ కావడానికి వాల్‌ సిట్ బెస్ట్ వ్యాయామానని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. మొదట్లో ఈ వ్యాయామాన్ని 15 నుంచి 20 సెకండ్ల పాటు ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు కొనసాగించాలని సూచించారు. వారానికి మూడు రోజులు లేదా రోజు వదలి రోజు ఈ వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..