బ్రిస్క్ వాకింగ్ చేస్తే జీవితకాలం రెట్టింపయినట్టే..

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:25 PM

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గడమే కాకుండా.. డ‌యాబెటిస్‌, గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీర కండ‌రాలు దృఢంగా మారుతాయి. ఇవే కాకుండా వాకింగ్ వ‌ల్ల ఇంకా మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే వాకింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. వాకింగ్ లో బ్రిస్క్ వాకింగ్ చేయడం ద్వారా పలు లాభాలు ఉన్నాయి. అయితే ఇంతకు ఈ బ్రిస్క్ వాక్ అంటే […]

బ్రిస్క్ వాకింగ్ చేస్తే జీవితకాలం రెట్టింపయినట్టే..
Follow us on

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గడమే కాకుండా.. డ‌యాబెటిస్‌, గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీర కండ‌రాలు దృఢంగా మారుతాయి. ఇవే కాకుండా వాకింగ్ వ‌ల్ల ఇంకా మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే వాకింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. వాకింగ్ లో బ్రిస్క్ వాకింగ్ చేయడం ద్వారా పలు లాభాలు ఉన్నాయి. అయితే ఇంతకు ఈ బ్రిస్క్ వాక్ అంటే ఏంటో తెలుసుకుందాం.

బ్రిస్క్ వాకింగ్‌…
బ్రిస్క్ వాకింగ్ అనేది జస్ట్ మనం నిత్యం చేసే వాకింగ్ కంటే ఇంకాస్త ఫాస్ట్ గా చేయాలి. అంటే పరుగులాంటి నడక అన్నమాట. అందుకే దీనికి బ్రిస్క్ వాక్ అని పేరువచ్చింది. ఇలా బ్రిస్క్ వాక్ చేయ‌డం ర‌న్నింగ్ చేసినంత‌టి ఫ‌లితాన్ని ఇస్తుంది. క్యాల‌రీలు మ‌రిన్ని ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీన్ని చేయ‌డం మంచిది. దీంతో కండ‌రాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి. డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గుతుంది. అంతేకాదు ఈ బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా మన జీవితకాలం కూడా రెట్టింపు అవుతోందని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు.

ప్రతినిత్యం చేసే బ్రిస్క్ వాక్ లేదా సైక్లింగ్ ద్వారా మనిషి తన జీవితకాలం రెట్టింపు అవుతుందని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. వీరు 1991 నుంచి 2009 మధ్య డెబ్బై ఏళ్లకు పైబడిని 6500 మంది దినచర్యలపై పరిశోధనలు చేపట్టారు. వీరిలో వాకింగ్ చేసే వారితో పాటుగా.. చెయ్యకుండా ఉన్నవారిపై కూడా పరిశోధనలు చేపట్టారు. అయితే పదేళ్ల అనంతరం వీరిలో దాదాపు 39శాతం మంది మరణించారు. వారంతా నిత్యం వాకింగ్ చేయని వారేనని తేలింది. అయితే మిగతా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కూడా ఇంకా వారి పనులను వారే చేసుకుంటున్నారని జాన్స్ హాప్కిన్స్ పరిశోధనా బృందం తెలిపింది. అంతేకాదు నిత్యం బ్రిస్క్ వాకింగ్ చేస్తున్న వారికి వృద్ధాప్యంలో వచ్చే రోగాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు.

జాన్స్ హాప్కిన్స్ బృందంలోని డాక్టర్ వెల్టన్ వీరందరినీ క్షుణ్ణంగా పరిశీలించారు. బ్రిస్క్ వాకింగ్ చేయని వారు ఏరోబిక్స్ చేసిన వారు కూడా అరవై ఏళ్లలో కూడా నలభై ఏళ్ల వయస్సు వారిలో చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. నిత్యం బ్రిస్క్ వాకింగ్ చేయలేని వారు ఏరోబిక్స చేసినా కూడా తగిన ఫలితం ఉంటుందని డాక్ట్ వెల్డన్ వెల్లడించారు.