వేసవిలో వచ్చే తలనొప్పికి.. అద్భుతమైన చిట్కాలు..

| Edited By:

May 04, 2019 | 2:49 PM

సాధారణంగా కాస్త పని ఒత్తిడి పెరిగితే మనకు తలనొప్పి వస్తుండటం సహజమే. అలాంటిది వేసవిలో ఎండవేడిమికి బయటికి వెళ్తే.. తలనొప్పే కాకుండా.. వడదెబ్బ కూడా తగులుతుంది. అయితే ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలతో పాటు.. పలు చిట్కాలు ఉపయోగిస్తే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో మీరు తెలుసుకోండి. 1. ఎండ‌లో తిర‌గాల్సి వ‌స్తే త‌ల‌పై టోపీ కానీ, టవల్ కానీ కప్పుకోవాలి. వీటి వ‌ల్ల ఎండ నేరుగా […]

వేసవిలో వచ్చే తలనొప్పికి.. అద్భుతమైన చిట్కాలు..
Follow us on

సాధారణంగా కాస్త పని ఒత్తిడి పెరిగితే మనకు తలనొప్పి వస్తుండటం సహజమే. అలాంటిది వేసవిలో ఎండవేడిమికి బయటికి వెళ్తే.. తలనొప్పే కాకుండా.. వడదెబ్బ కూడా తగులుతుంది. అయితే ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలతో పాటు.. పలు చిట్కాలు ఉపయోగిస్తే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో మీరు తెలుసుకోండి.

1. ఎండ‌లో తిర‌గాల్సి వ‌స్తే త‌ల‌పై టోపీ కానీ, టవల్ కానీ కప్పుకోవాలి. వీటి వ‌ల్ల ఎండ నేరుగా మ‌న త‌ల‌కు త‌గ‌ల‌కుండా ఉంటుంది. దీంతో త‌ల‌నొప్పి రాకుండా ఉంటుంది.

2. ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల తలనొప్పి వస్తే.. వెంటనే కాసేపు నీడలో సేదాతీరాలి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీని వ‌ల్ల మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లిగి.. తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3. రోజుకు తగినంత నీటిని తాగకపోయినా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. కాబట్టి రోజు తగిన మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.

4. చ‌ల్ల‌ని కొబ్బ‌రినీళ్లు, మ‌జ్జ‌ిగ‌, ఇత‌ర స‌హ‌జ సిద్ధ పానీయాల‌ను తాగితే త‌ల‌నొప్పి రాకుండా ఉంటుంది.

5. అర‌టి పండ్లు, పైనాపిల్‌, పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా త‌లనొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.