
పాలు మన రోజువారీ ఆహారంలో కీలక పాత్రను పోషిస్తాయి. టీ, కాఫీ లేదా ఇతర పదార్థాల రూపంలో రోజూ ఏదో విధంగా మనం వీటిని తీసుకుంటూనే ఉంటాం. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి12, పొటాషియం, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, ఎముకలు, కండరాలు బలపడతాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల హాయిగా నిద్ర పట్టవచ్చు. కానీ సాదా పాలు తాగే బదులు, దానికి కొన్ని సహజ పదార్థాలు జోడించడం వల్ల పాల పోషక విలువలు రెట్టింపు అవుతాయి. ఈ వ్యాసంలో, పాలను శక్తివంతమైన పానీయంగా మార్చే ఐదు ముఖ్యమైన పదార్థాల గురించి తెలుసుకుందాం.
పాలలో పసుపు కలిపి తాగడం
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాలలోని కొవ్వు పదార్ధం శరీరం ఈ కర్కుమిన్‌ను సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పసుపు వేసి మరిగించి తాగడం ద్వారా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన నివారణ
పాలు, దాల్చిన చెక్క
పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకోవడం వల్ల పాల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. దాల్చిన చెక్క శరీరంలో మంటను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది, తద్వారా పాలలోని కేలరీలు కొవ్వుగా నిల్వ కాకుండా శక్తిగా మారుతాయి.
పాలలో లేనే కలపడం
సాధారణంగా చాలా మంది రుచి కోసం పాలలో చక్కెర కలిపుకొని తాగుతారు. కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం, కాబట్టి దానికి బదులుగా తేనె వాడటం మంచిది. స్వచ్ఛమైన తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తేనెను పాలతో కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.శరీరానికి అంతర్గత బలాన్ని ఇస్తుంది. ఇది సహజమైన తీపి పదార్థం, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పాల రుచిని పెంచుతుంది.
పాలలో చియా సీడ్స్ కలపడం
చియా గింజలు చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ వాటి ప్రయోజనాలు మాత్రం అపారమైనవి. వాటిలో ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాలతో కలిపి వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, ఇది ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజలను పాలతో కలిపి తీసుకోవడం ఒక అద్భుతమైన ఎంపిక.
పాలలో బాధం వెన్న కలపడం
పాలలో ఒక చెంచా బాదం వెన్న కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇది పాలను చిక్కగా చేస్తుంది, ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. బాదం వెన్నలోని పోషకాలు పాలలోని చక్కెర శాతం నెమ్మదిగా రక్తంలోకి విడుదలయ్యేలా చూస్తాయి. ఇది తరచుగా అలసటను నివారిస్తుం.అలాగే రోజంతా మీరు ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.