
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు.హెల్తీగా ఉండాలని ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న ఆహారాలు తింటున్నారు. అయితే నాన్‌వెజ్ లవర్స్‌కు ప్రోటిన్ తీసుకోవడానికి చికెన్, మటన్ ఇలా చాలా ఆఫ్షన్ ఉన్నాయి. కాని వెజిటేరియన్స్ పనీర్, సోయాచంక్స్ మాత్రమే అధిక ప్రోటిన్‌ను అందిస్తాయి. అయితే పనీర్ కర్రీస్ గురించి అందరికి తెలుసు.. కానీ సోయా చంక్స్‌ను సరైన విధానంలో వండితే.. ఇది మటన్‌ను సైతం తలదన్నే టెస్ట్ వస్తుందని.. చాలా మందికి తెలియదు. కాబట్టి రైస్, చపాతీలలోకి ఎంతో రుచికరంగా ఉండే.. మీల్ మేకర్ మసాల కూరను తక్కువ సమయంలోనే ఇంట్లోనే అదిరిపోయచే టెస్ట్‌తో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాం.
మీల్ మేకర్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు
మీల్ మేకర్ మసాల కర్రీ తయారీ విధానం
స్టెప్-1: మీల్ మేకర్ మసాల కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, ఆరు జీడిపప్పు వేసి నీళ్లు కలపకుండా మెత్తగా పొడి చేయాలి. దానిలో తగినన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్‌గా చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్-2: ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా, ఒక టీస్పూన్ చికెన్ మసాలా, పావు టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీ-జీడిపప్పు పేస్ట్, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసేలా చూసుకోవాలి.
స్టెప్-3: ఇప్పుడు 50 గ్రాముల మీల్ మేకర్‌ను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని పూర్తిగా పిండేసి, ముందుగా తయారు చేసుకున్న మసాలా మిశ్రమంలో వేసి, మసాలా అంతా మీల్ మేకర్‌కు పట్టేలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్-4: ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీస్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక ఎండుమిరపకాయ వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
స్టెప్-5: అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్‌ను పాన్‌లో వేసి, మీడియం మంటపై నాలుగు నిమిషాల పాటు బాగా వేయించాలి. నాలుగు నిమిషాల తర్వాత మసాలా నుండి నూనె విడిపోయి పక్కకు వస్తుంది. ఇప్పుడు పావు గ్లాసు నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి.
స్టెప్-6: నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఐదు నిమిషాల పాటు మీడియం మంటపై ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత కూర నుండి నూనె పైకి తేలితే కర్రీ సిద్ధమైనట్టు అర్థం. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోని స్టౌవ్ ఆఫ్ చేస్తే సరి.. మీకు ఎంతో ఇష్టమైన మీల్ మేకర్ మసాల కర్రీ రెడీ అయినట్టే!
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.