జొమాటోలో కొత్త వివాదం… ఏమిటది?

| Edited By:

Aug 11, 2019 | 3:50 PM

సోమవారం నుంచి జొమాటో డెలివరీ బాయ్‌లు సమ్మె చేయనున్నారు. ఎందుకంటే.. జొమాటోలో ఉన్న హిందూ, ముస్లిం డెలివరీ బాయ్‌లందరూ తమ మత విశ్వాసాలను కించపరిచేలా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ డెలివరీ బాయ్‌లు బీఫ్ వంటకాలను,  ముస్లిం డెలివరీ బాయ్‌లు పోర్క్ వంటకాలను డెలివరీ చేయాల్సి వస్తుందని ఇది మత విశ్వాసాలను దెబ్బ తీసేలా పనిచేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇకపై తాము ఇలా పనిచేయబోమని చెబుతూ.. జొమాటో డెలివరీ బాయ్‌లందరూ ఆందోళన చేపట్టనున్నారు. […]

జొమాటోలో కొత్త వివాదం... ఏమిటది?
Follow us on

సోమవారం నుంచి జొమాటో డెలివరీ బాయ్‌లు సమ్మె చేయనున్నారు. ఎందుకంటే.. జొమాటోలో ఉన్న హిందూ, ముస్లిం డెలివరీ బాయ్‌లందరూ తమ మత విశ్వాసాలను కించపరిచేలా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ డెలివరీ బాయ్‌లు బీఫ్ వంటకాలను,  ముస్లిం డెలివరీ బాయ్‌లు పోర్క్ వంటకాలను డెలివరీ చేయాల్సి వస్తుందని ఇది మత విశ్వాసాలను దెబ్బ తీసేలా పనిచేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇకపై తాము ఇలా పనిచేయబోమని చెబుతూ.. జొమాటో డెలివరీ బాయ్‌లందరూ ఆందోళన చేపట్టనున్నారు.

ఇక జొమాటోలో తమకు అందుతున్న కమిషన్, మెడికల్, ఇతర సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని, అందువల్లే తాము సోమవారం నుంచి సమ్మె చేపడుతున్నామని వారు తెలిపారు. జొమాటో యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది.