కర్ణాటక ప్రభుత్వంతో టీటీడీ కీలక చర్చలు

|

Jul 04, 2020 | 6:57 PM

కర్ణాటక ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్పతో సమావేశమయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి. తిరుమ‌ల‌లోని 7 ఎకరాల 5కుంట భూమిని 50 ఏళ్ల కాలపరిమితికి టీటీడీ 2008లో కర్ణాటక ప్రభుత్వానికి లీజుకు ఇచ్చింది. ఈ ప్రాంతంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం ప‌నుల కోసం టీటీడీ అనుమ‌తి కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ఒక ప్లాన్‌ స‌మ‌ర్పించింది. దీనిపై క‌ర్ణాట‌క దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఏఎస్ రోహిణి సింధూరి ఇటీవ‌ల టీటీడీ ఛైర్మన్‌ను క‌లిసి చ‌ర్చించారు. ఈ […]

కర్ణాటక ప్రభుత్వంతో టీటీడీ కీలక చర్చలు
Follow us on

కర్ణాటక ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్పతో సమావేశమయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి. తిరుమ‌ల‌లోని 7 ఎకరాల 5కుంట భూమిని 50 ఏళ్ల కాలపరిమితికి టీటీడీ 2008లో కర్ణాటక ప్రభుత్వానికి లీజుకు ఇచ్చింది. ఈ ప్రాంతంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం ప‌నుల కోసం టీటీడీ అనుమ‌తి కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ఒక ప్లాన్‌ స‌మ‌ర్పించింది. దీనిపై క‌ర్ణాట‌క దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఏఎస్ రోహిణి సింధూరి ఇటీవ‌ల టీటీడీ ఛైర్మన్‌ను క‌లిసి చ‌ర్చించారు.

ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు బెంగ‌ళూరులో సీఎం య‌డ్యూర‌ప్పతో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. తిరుమలలోని క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో కొత్త‌గా నిర్మించత‌లపెట్టిన నూతన వసతి సముదాయం టీటీడీ నిబంధనల మేరకు నిర్మించడానికి సూత్రప్రాయ అంగీకారంకుదిరింది. కర్ణాటక ప్రభుత్వం త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్లాన్ ను టీటీడీకి సమర్పిస్తుంది. దీన్ని టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోదించాక కర్ణాటక ప్రభుత్వం 200 కోట్లు టీటీడీకి డిపాజిట్ చేస్తుంది.