యువరాజ్‌ న్యూ లుక్ అదుర్స్!

| Edited By:

Jun 29, 2019 | 7:30 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఇప్పుడు సరికొత్త అవతారంతో రానున్నాడు. వినోద రంగంలో కాలు మోపి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. హాట్ స్టార్ స్పెషల్స్ తాజా సిరీస్‌ ‘ది ఆఫీస్‌’లో భాగం కానున్నట్లు వెల్లడించాడు. ది ఆఫీస్‌ అనే అంతర్జాతీయ సిరీస్‌ ఆధారంగా అదే పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ప్రతిసారి కొత్తగా ట్రై చేయడం బాగుటుంది. జీవితం మొత్తం క్రికెటే ఉంది. ఆ ఆట నాకు అన్నీ ఇచ్చింది. అది నా […]

యువరాజ్‌ న్యూ లుక్ అదుర్స్!
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఇప్పుడు సరికొత్త అవతారంతో రానున్నాడు. వినోద రంగంలో కాలు మోపి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. హాట్ స్టార్ స్పెషల్స్ తాజా సిరీస్‌ ‘ది ఆఫీస్‌’లో భాగం కానున్నట్లు వెల్లడించాడు. ది ఆఫీస్‌ అనే అంతర్జాతీయ సిరీస్‌ ఆధారంగా అదే పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

‘ప్రతిసారి కొత్తగా ట్రై చేయడం బాగుటుంది. జీవితం మొత్తం క్రికెటే ఉంది. ఆ ఆట నాకు అన్నీ ఇచ్చింది. అది నా జీవితంలో అతి పెద్ద భాగం. ఏదైనా కొత్తగా చేయడానికి నాకు ఇప్పుడు సమయం దొరికింది’ అని యువరాజ్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ఫరీదాబాద్ దగ్గర్లోని ఒక కాగితం పరిశ్రమలోని ఉద్యోగుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ది ఆఫీస్‌’ 13 ఏపిసోడ్లుగా వీక్షకుల ముందుకు రానుంది. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లడం, ఉద్యోగులతో మాట్లాడటంపై మీడియాతో వివరిస్తూ..‘అక్కడున్న ఉద్యోగులతో మాట్లాడటం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నా జీవితంలో ఇంత క్రేజీనెస్‌ను ఎప్పుడు చూడలేదని చెప్పగలను’ అని యువరాజ్ చాలా ఉత్సాహంగా వెల్లడించాడు.