అమరావతి రైతులకు వైసీపీ ఎంపీ సంఘీభావం…

|

Feb 01, 2020 | 7:24 AM

ఇది నిజంగా ఊహించని పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 45 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వీరి దీక్షలకు టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కానీ ఊహించని విధంగా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. వెలగపూడి, మందడంలోని దీక్షా శిబిరాలకు వెళ్లిన ఎంపీ..వారి బాధను అడిగి తెలుసుకున్నారు. రైతులలో చర్చలు జరపడానికి ప్రభుత్వ సిద్దంగా ఉందని చెప్పిన ఆయన..న్యాయం జరిగే ప్రక్రియ […]

అమరావతి రైతులకు వైసీపీ ఎంపీ సంఘీభావం...
Follow us on

ఇది నిజంగా ఊహించని పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 45 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వీరి దీక్షలకు టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కానీ ఊహించని విధంగా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. వెలగపూడి, మందడంలోని దీక్షా శిబిరాలకు వెళ్లిన ఎంపీ..వారి బాధను అడిగి తెలుసుకున్నారు. రైతులలో చర్చలు జరపడానికి ప్రభుత్వ సిద్దంగా ఉందని చెప్పిన ఆయన..న్యాయం జరిగే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి కమిటీ త్వరలో రైతుల వద్దకు వస్తుందని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. రాజధాని కోసం భూములు స్వచ్చంధంగా ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందన్న ఎంపీ, ఆందోళన చేస్తున్న రైతులందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. రెండువైపులా ఓ మాట తూలడం జరుగుతుందని… రైతులు సంయ‌మ‌నం పాటించాలని కోరారు. భూములిచ్చిన రైతులు ఎమోషనల్‌గానే ఉంటారని పేర్కొన్నారు.  రైతులందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, సీఎం జగన్ రైతుల పక్షపాతి అని తెలిపారు.