మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో రెండు పథకాలకు శ్రీకారం.!

|

Jul 30, 2020 | 2:29 PM

మహిళల సాధికారత కోసం ఆగష్టు, సెప్టెంబర్‌లలో మరో రెండు సంక్షేమ పధకాలను ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో రెండు పథకాలకు శ్రీకారం.!
Follow us on

YSR Cheyutha And Asara Schemes: మహిళల సాధికారత కోసం ఆగష్టు, సెప్టెంబర్‌లలో మరో రెండు సంక్షేమ పధకాలను ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ భేటిలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆగష్టులో ప్రారంభించే ‘వైఎస్ఆర్ చేయూత’ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్‌లో ‘వైఎస్ఆర్ ఆసరా’ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ. 6700 కోట్ల రుణ సాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ రెండు పధకాలతో సుమారు కోటి మందికి పైగా మహిళలు లబ్ది పొందుతారని ఆయన తెలిపారు.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల కోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు చొప్పున నాలుగేళ్లకు రూ. 44 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వారి జీవితాలను మార్చేందుకు ఈ సహాయం ఉపయోగపడాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దీనికి బ్యాంకర్లు కూడా సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!