జగన్ బిజీ బిజీ షెడ్యూల్..!

| Edited By:

May 24, 2019 | 5:09 PM

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అత్యధిక మోజార్టీతో విజయదుందుబి మోగించారు. ఈ విజయంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం పెరిగింది. పెద్దఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం అమరావతిలో తాడేపల్లి ఇంట్లో ఉన్న జగన్ ఈ నెల 26న కడప జిల్లాకు వెళ్లనున్నారు. ముందుగా వేంపల్లిలోని ఇడుపలపాయలో ఉన్న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పించి, ఇక […]

జగన్ బిజీ బిజీ షెడ్యూల్..!
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అత్యధిక మోజార్టీతో విజయదుందుబి మోగించారు. ఈ విజయంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం పెరిగింది. పెద్దఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం అమరావతిలో తాడేపల్లి ఇంట్లో ఉన్న జగన్ ఈ నెల 26న కడప జిల్లాకు వెళ్లనున్నారు. ముందుగా వేంపల్లిలోని ఇడుపలపాయలో ఉన్న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పించి, ఇక అదే రోజు గండి ఆంజనేయస్వామిని దర్శించుకుని అనంతరం పులివెందుల వెళ్తారు. అలాగే.. కడప పెద్ద దర్గాను కూడా సందర్శించనున్నారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.