పోసానికి మూడు క్రేజీ పదవులు ఆఫర్ చేసిన జగన్..

పోసాని కృష్ణ మురళి..తెలుగు సినిమాలోనే కాదు, తెలుగు రాజకీయాల్లో కూడా ఈ పేరు ఓ సంచలనం. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం పోసాని స్టైల్. తాను మద్దతిస్తోనన్న పార్టీకి చెందినవాడు అని కూడా చూడకుండా.. ఇటీవలే అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పృథ్వీని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకీపారేశారు ఈ సీనియర్ నటుడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన పోసాని, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జగన్ ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ […]

పోసానికి మూడు క్రేజీ పదవులు ఆఫర్ చేసిన జగన్..

Updated on: Jan 17, 2020 | 8:36 PM

పోసాని కృష్ణ మురళి..తెలుగు సినిమాలోనే కాదు, తెలుగు రాజకీయాల్లో కూడా ఈ పేరు ఓ సంచలనం. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం పోసాని స్టైల్. తాను మద్దతిస్తోనన్న పార్టీకి చెందినవాడు అని కూడా చూడకుండా.. ఇటీవలే అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పృథ్వీని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకీపారేశారు ఈ సీనియర్ నటుడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన పోసాని, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జగన్ ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ ఆఫర్ చేశారని..తాను మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిపారు. జగన్ సన్నిహితులు ఇంటికి వచ్చి పదవుల విషయం చర్చకు తీసుకువస్తే..తనకు మాత్రం సినిమాలంటేనే ఇష్టమని చెప్పారట ఈ సీనియర్ నటుడు. రాజకీయాలంటే ఇష్టమున్నా, పదవులు తీసుకుంటే ప్రశాంతత ఉండదని..అందుకే ఎప్పుడూ జగన్ మద్దతిస్తానని, పదవులు వద్దని తెగేసి చెప్పారట. తాను చనిపోయేవరకు జగన్ ప్రేమతో మాట్లాడితే చాలని, ఇంటికి వచ్చిన వ్యక్తితో చెప్పి పంపారట పోసాని. ఈ విషయం తెలిసి జగన్ నవ్వుకున్నారని తెలిసిందని చెప్పుకొచ్చారు. ఇక ప్రజారాజ్యం పార్టీలో కూడా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పలేదని, చిరూనే పిలిచి టికెట్ ఇచ్చినట్టు తెలిపారు పోసాని.

Loading...
Unable to load recommendations.
Follow Us