ఇజ్రాయెల్‌లో ఇంటరాక్షన్.. వ్యవసాయంపై ఫోకస్.. ఇది ‘జగన్’ సీన్

| Edited By:

Aug 03, 2019 | 10:06 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ పలువురు ప్రముఖులతో భేటీ కానున్న జగన్.. తాజాగా స్థానిక రైతులతో మాట్లాడారు. నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి..? అధిక దిగుబడుల కోసం అనుసరిస్తున్న విధానాలను ఏంటి..? అన్న వాటిపై వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకున్నాయి. నీటి ఎద్దటి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వ్యవసాయంలో విప్లవాత్మక ఫలితాలు సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ […]

ఇజ్రాయెల్‌లో ఇంటరాక్షన్.. వ్యవసాయంపై ఫోకస్.. ఇది ‘జగన్’ సీన్
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ పలువురు ప్రముఖులతో భేటీ కానున్న జగన్.. తాజాగా స్థానిక రైతులతో మాట్లాడారు. నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి..? అధిక దిగుబడుల కోసం అనుసరిస్తున్న విధానాలను ఏంటి..? అన్న వాటిపై వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకున్నాయి. నీటి ఎద్దటి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వ్యవసాయంలో విప్లవాత్మక ఫలితాలు సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలో అక్కడి వ్యవసాయ పద్ధతులను సీఎం జగన్ తెలుసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన అనంతరం జగన్ ఈ నెల 5న విజయవాడకు తిరిగిరానున్నారు.