Youtube Actress: డ్రైవర్‌ తనను అసభ్యంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..

|

Jan 24, 2021 | 9:39 PM

Youtube Actress Facing Harassment: తాను నియమించుకున్న డ్రైవరే తనపై వేధింపులకు దిగాడని ఓ యూట్యూబ్‌ నటి బంజారహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Youtube Actress: డ్రైవర్‌ తనను అసభ్యంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..
Follow us on

Youtube Actress Facing Harassment: తాను నియమించుకున్న డ్రైవరే తనపై వేధింపులకు దిగాడని ఓ యూట్యూబ్‌ నటి బంజారహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నేహా శర్మ అనే నటి ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. అయితో కొన్ని రోజుల క్రితం నటి నేహా శర్మ షూటింగ్‌ నిమిత్తం కేరళకు వెళ్లింది. ఈ సమయంలో తనతో పాటు కారు నడపడానికి వచ్చిన డ్రైవర్‌ షేక్‌ ఇబ్రహీం కేరళకు వెళ్లే సమయంలో తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్‌కు బానిసైన డ్రైవర్‌ షేక్‌ ఇబ్రహీం డబ్బు కోసం తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నాడని నేహా శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నటి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Gold Scam: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన రూ.300 కోట్ల భారీ గోల్డ్‌ స్కామ్‌… 1500 మందిని మోసం చేసిన ఇఫ్సర్ అరెస్ట్…