Children Cancer fund : యూత్ హెల్త్‌పై దృష్టి పెట్టాలన్న బాలయ్య..

|

Feb 15, 2020 | 10:08 PM

Children Cancer fund : ప్రజంట్ జనరేషన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని  సిని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యూతే బలమని, వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరని తెలిపారు. ‘ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే‌’ నేపథ్యంలో.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ, హీరోయిన రష్మిక మందన్న పాల్గొన్నారు. అభం శుభం తెలియని చిన్నపిల్లలను  క్యాన్సర్ మహమ్మారి కబలించడం బాధ కలిగిస్తుందని బాలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్‌కు […]

Children Cancer fund : యూత్ హెల్త్‌పై దృష్టి పెట్టాలన్న బాలయ్య..
Follow us on

Children Cancer fund : ప్రజంట్ జనరేషన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని  సిని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యూతే బలమని, వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరని తెలిపారు. ‘ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే‌’ నేపథ్యంలో.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ, హీరోయిన రష్మిక మందన్న పాల్గొన్నారు. అభం శుభం తెలియని చిన్నపిల్లలను  క్యాన్సర్ మహమ్మారి కబలించడం బాధ కలిగిస్తుందని బాలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్‌కు డోనేషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి కన్నా..దాని వల్ల కలిగే భయమే ప్రమాదకరమైందన్న బాలయ్య..క్యాన్సర్‌కి  వైద్యం అందరికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ..క్యాన్సర్ మహమ్మారిని జయించిన చిన్నారులను చూస్తుంటే..ఆనందంతో తన కళ్లలో నీళ్లు ఉబుకుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధి బారిన పడిన చిన్నారులకు..వైద్యం అందిస్తోన్న డాక్టర్లకు, నర్సులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.