గుర్తుపెట్టుకొని మరీ ఫొటోగ్రాఫర్‌పై ఎన్టీఆర్ పంచులు.. వీడియో వైరల్!

| Edited By:

Jan 21, 2020 | 3:06 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ సరదాగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. షూటింగ్‌ టైంలో కూడా ఆయన అందర్నీ ఆటపట్టిస్తూంటారు. ఇప్పుడు అలాంటి ఓ సంఘటనే ఓ ఫొటోగ్రాఫర్‌కి ఎదురైంది. అతనికి గుర్తుపెట్టుకుని మరీ ఎన్టీఆర్ పంచులు వేశారు. దీనికి ఆ ఫొటోగ్రాఫర్ ఉబ్బితబ్బిబైైపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అయ్యింది. ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికని ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. ఈరోజు హైదరాబాద్‌ ఎయిర్ పోర్టకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఓ ఫొటోగ్రాఫర్ ఎన్టీఆర్‌ని ఫొటోలు […]

గుర్తుపెట్టుకొని మరీ ఫొటోగ్రాఫర్‌పై ఎన్టీఆర్ పంచులు.. వీడియో వైరల్!
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ సరదాగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. షూటింగ్‌ టైంలో కూడా ఆయన అందర్నీ ఆటపట్టిస్తూంటారు. ఇప్పుడు అలాంటి ఓ సంఘటనే ఓ ఫొటోగ్రాఫర్‌కి ఎదురైంది. అతనికి గుర్తుపెట్టుకుని మరీ ఎన్టీఆర్ పంచులు వేశారు. దీనికి ఆ ఫొటోగ్రాఫర్ ఉబ్బితబ్బిబైైపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అయ్యింది.

ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికని ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. ఈరోజు హైదరాబాద్‌ ఎయిర్ పోర్టకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఓ ఫొటోగ్రాఫర్ ఎన్టీఆర్‌ని ఫొటోలు తీశాడు. అతన్ని గుర్తు పెట్టుకున్న ఎన్టీఆర్.. దగ్గరకి పిలిచి.. నువ్వు ఇక్కడే ఉంటావా?  స్నానం, టిఫిన్స్ అన్ని ఇక్కడేనా? అంటూ జోక్ చేశారు. దీనికి ఆయనతోపాటు వచ్చినవారంతా సరదాగా నవ్వుకున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ ముంబై వెళ్లినప్పుడు ఆ ఫొటోగ్రాఫరే ఫొటోలు తీశాడు. కాగా.. రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా జులై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.