ప్రియురాలి కుటుంబంపై కోపం, షాపుకు నిప్పు

|

Sep 27, 2020 | 8:46 PM

ప్రేయసి ఫ్యామిలీపై  కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రియురాలి కుటుంబంపై కోపం, షాపుకు నిప్పు
Follow us on

 ప్రేయసి ఫ్యామిలీపై  కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై, మానిక్‌పుర్‌కు చెందిన రాహుల్‌ పాశ్వాన్‌ అనే యువకుడు అదే ఏరియాకి చెందిన 21 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబం రాహుల్‌ను మందలించింది. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు సెప్టెంబర్‌ 10వ తేదీన ప్రేయసి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి ఎస్కేప్ అయ్యాడు.

తొలుత షాపునకు నిప్పంటుకోవటానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ అని అందరూ అనుకున్నారు. సెప్టెంబర్‌ 21వ తేదీన యువతి తండ్రి తన షాపునకు సమీపంలోని ఓ షాపునకు సంబంధించిన సీసీ టీవీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం తెలిపింది. రాహుల్‌ షాపులోకి నిప్పును అంటిస్తోన్న విజువల్స్ రికార్డయ్యాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాహుల్‌ కోసం గాలిస్తున్నారు.

Also Read :

ఏపీలో శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం, 30 శాతం సబ్సిడీ

Breaking : 3 రైతు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర