నెపొటిజ‌మ్ పై హీరో నిఖిల్ హాట్ కామెంట్స్

|

Jun 22, 2020 | 3:29 PM

నెపొటిజ‌మ్ పై యంగ్ హీరో నిఖిల్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలు. ఫిలిం ఇండస్ట్రీలో నెపొటిజమ్ అనేది కామన్ అని.. ఇది ఒక సినిమా రంగానికే కాదు ప్రతి ఫీల్డ్‌లోనూ సర్వసాధారణమేనని నిఖిల్ తేల్చి చెప్పేశారు.

నెపొటిజ‌మ్ పై హీరో నిఖిల్ హాట్ కామెంట్స్
Follow us on

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెపొటిజ‌మ్ హాట్ టాఫిక్ మారింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో నెపొటిజ‌మ్ మరోసారి తెరపైకి వస్తుంది. దీని చాలా మంది సినీ ప్రముఖులు గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా సినీ రంగంలో ఎదగకుండా తొక్కేస్తున్నారంటూ ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. ఇంతవరకు టాలీవుడ్ కే పరిమితమైన నెపొటిజ‌మ్ బాలీవుడ్ కి అంటుకుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి యంగ్ హీరో నిఖిల్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఫిలిం ఇండస్ట్రీలో నెపొటిజమ్ అనేది కామన్ అని.. ఇది ఒక సినిమా రంగానికే కాదు ప్రతి ఫీల్డ్‌లోనూ సర్వసాధారణమేనని నిఖిల్ తేల్చి చెప్పేశారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని వాళ్లు సినీ ఇండ‌స్ట్రీలో రాణించాలంటే చాలా కష్టమన్నారు. అలాంట‌ప్పుడు మ‌రింత జాగ్రతగా ఉంటూ సాధన చేయాలి తప్ప ఆత్మ‌హ‌త్య ప‌రిష్కారం కాదన్నాడు నిఖిల్. ఎన్నిసమ‌స్య‌లు ఎదురైనా పోరాడి నిల‌బ‌డాలిగితేనే జీవితం అంటున్నారు నిఖిల్