పవన్ కళ్యాణ్ ఓటమిపై రోజా స్పందన..!

| Edited By:

Jun 15, 2019 | 10:56 AM

ఏపీ2019 ఎన్నికల్లో జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిచివుంటే బాగుండేదని, వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తెలిపారు. జనసేన ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రజారాజ్యం పార్టీనే అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీచేసి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, దాన్ని ఆ పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు కూడా పవన్ అదే పని చేస్తారోమోనన్న సందేహం వల్లే జనసేన పార్టీని ప్రజలు దూరంగా పెట్టారని చెప్పారు. […]

పవన్ కళ్యాణ్ ఓటమిపై రోజా స్పందన..!
Follow us on

ఏపీ2019 ఎన్నికల్లో జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిచివుంటే బాగుండేదని, వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తెలిపారు. జనసేన ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రజారాజ్యం పార్టీనే అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీచేసి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, దాన్ని ఆ పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు కూడా పవన్ అదే పని చేస్తారోమోనన్న సందేహం వల్లే జనసేన పార్టీని ప్రజలు దూరంగా పెట్టారని చెప్పారు. అయినా.. ఎన్నికల ఫలితాల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే రోజా.