ఆయన చేసేది శవ రాజకీయమే : అంబటి

| Edited By:

Sep 20, 2019 | 6:37 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. మాజీ స్పీకర్ కోడెల మృతిపై చంద్రబాబు ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోడెల 16వ తేదీన మరణిస్తే 19 వ తేదీ వరకు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఇది ఆత్మహత్య కాదని నమ్మించాలని చూశారన్నారు. ఎవరైన మరణిస్తే ఎలాంటి వారికైనా భావొద్వేగం వస్తుందని, కానీ చంద్రబాబులో ఎక్కడా అది కనిపించలేదన్నారు అంబటి. కోడెల మరణం తర్వాత నాలుగు రోజుల పాటు […]

ఆయన  చేసేది శవ రాజకీయమే : అంబటి
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. మాజీ స్పీకర్ కోడెల మృతిపై చంద్రబాబు ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోడెల 16వ తేదీన మరణిస్తే 19 వ తేదీ వరకు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఇది ఆత్మహత్య కాదని నమ్మించాలని చూశారన్నారు. ఎవరైన మరణిస్తే ఎలాంటి వారికైనా భావొద్వేగం వస్తుందని, కానీ చంద్రబాబులో ఎక్కడా అది కనిపించలేదన్నారు అంబటి. కోడెల మరణం తర్వాత నాలుగు రోజుల పాటు పొలిటికల్ మైలేజ్ కోసమే చంద్రబాబు తాపత్రయపడ్డారని, గతంలో కూడా కోడెల ఆత్మహత్య చేసుకునేందు ప్రయత్నించారనే విషయం బయటపడిందన్నారు. కోట్ల విలువైన ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్‌ను హైదరాబాద్ నుంచి నేరుగా కోడెల కుమారుడి షోరూమ్‌కి లారీల్లో తరలించారని, వీటి విలువను కేవలం లక్ష రూపాయలుగా చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కోడెల మృతిని వైసీపీ మీదకు నెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు శవాల మీద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.