Yatra-2 movie update : వాయిదాపడిన యాత్ర2 సినిమా.. వైఎస్ జగన్ పాత్రలో ఆ స్టార్ హీరో.?

|

Jan 25, 2021 | 11:17 AM

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర.  ఈ సినిమా ప్రేక్షకులను అలరించి..

Yatra-2 movie update : వాయిదాపడిన యాత్ర2 సినిమా.. వైఎస్ జగన్ పాత్రలో ఆ స్టార్ హీరో.?
Follow us on

yatra-2 movie update : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర.  ఈ సినిమా ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిఅద్భుతంగా నటించారు. మమ్ముటి తన నటన, హావభావాలతో వైఎస్ఆర్ ను గుర్తు చేశారు. ఈ సినిమాకు మహి వి.రాఘవ దర్శకత్వం వహించారు. చాలాకాలంగా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. దర్శకుడు మహి వి.రాఘవ కూడా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఈ సీక్వెల్ లో వై.ఎస్.ఆర్ తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు. అయితే ఈ సీక్వెల్ లో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే తమిళ నటుడు సూర్య జగన్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇటీవలే సూర్య కు కథ వివరించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అయితే ఈ సినిమా ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడంలేదు. తాజాగా సమాచారం ప్రకారం మహి వి.రాఘవ ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడట. దాంతో యాత్ర2 వాయిదా పడనుందట. మల్టీస్టారర్ సినిమా తర్వాత యాత్ర2 ను ప్రారంభించాలని చూస్తున్నాడట మహి వి.రాఘవ