World Bank: ఏపీ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు కితాబు

| Edited By: Pardhasaradhi Peri

Feb 25, 2020 | 12:44 PM

ఏపీలో జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించినట్లు సీఎంఓ తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంగళవారం ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.

World Bank: ఏపీ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు కితాబు
Follow us on

World bank team appreciates Jagan govt: ఏపీలో జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించినట్లు సీఎంఓ తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంగళవారం ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. మంగళవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్న వరల్డ్ బ్యాంకు ప్రతినిధి బృందం ముందుగా సీఎస్‌తో భేటీ అయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం జగన్ వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం ద్వారా అభివృద్ది ఫలితాలు త్వరగా వస్తాయని ప్రపంచబ్యాంకు ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని ప్రపంచబ్యాంకు బృందం ప్రశంసించినట్లు తెలుస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు పాలు పంచుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసిన వరల్డ్‌ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌ బెంజ్ ఇతర అధికారులు త్వరలో మరోసారి భేటీ అయి, కలిసి పనిచేసే ప్రాజెక్టులను గుర్తించనున్నట్లు తెలుస్తోంది.

Read this: Jagan crucial comments on Chandrababu చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు