Valentine’s Day Pledge: లవ్ మ్యారేజ్ చేసుకోమని విద్యార్థినుల ప్రమాణం

|

Feb 14, 2020 | 10:01 PM

Valentine’s Day Pledge: ప్రేమికులు రోజంటే ఎలా ఉంటుంది. ఆ రోజు ఎక్కడ చూసినా లవ్ కపుల్సే దర్శనమిస్తాయి. ఇక ఒకరికి ప్రపోజ్ చేయడం లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. కానీ  మహారాష్ట్ర అమరావతిలో ఓ స్కూల్ విద్యార్థినులు వినూత్న ప్రతిజ్ఞ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చందూర్ రైల్వేలోని మహిలా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల విద్యార్థులు మరాఠీలో “ఎవరినీ ప్రేమించము, ఎప్పటికీ ప్రేమ జోలికి వెళ్లము. అటువంటి వివాహాలు చేసుకోము. మా తల్లిదండ్రులపై  పూర్తి నమ్మకం […]

Valentines Day Pledge: లవ్ మ్యారేజ్ చేసుకోమని విద్యార్థినుల ప్రమాణం
Follow us on

Valentine’s Day Pledge: ప్రేమికులు రోజంటే ఎలా ఉంటుంది. ఆ రోజు ఎక్కడ చూసినా లవ్ కపుల్సే దర్శనమిస్తాయి. ఇక ఒకరికి ప్రపోజ్ చేయడం లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. కానీ  మహారాష్ట్ర అమరావతిలో ఓ స్కూల్ విద్యార్థినులు వినూత్న ప్రతిజ్ఞ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చందూర్ రైల్వేలోని మహిలా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల విద్యార్థులు మరాఠీలో “ఎవరినీ ప్రేమించము, ఎప్పటికీ ప్రేమ జోలికి వెళ్లము. అటువంటి వివాహాలు చేసుకోము. మా తల్లిదండ్రులపై  పూర్తి నమ్మకం ఉంది. వారే మాకు ఉత్తమమైన వారిని వెతికిపెడతారు. అంతేకాదు కట్నం కోరిన వారిని కూడా వివాహం చేసుకోము” అని ప్రమాణం చేసారు.

‘యువత ముందు సవాళ్లు’ పేరుతో ఉపాధ్యాయులు నిర్వహించిన చర్చలో, జాతీయ సేవా శిబిరంలో (ఎన్‌ఎస్‌ఎస్) పాల్గొన్న 100 మంది విద్యార్థుల్లో 40 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర హవ్రే మాట్లాడుతూ, బాలికలు చదువులపై దృష్టి పెట్టడం, జీవితం తరువాతి దశలో వివాహం గురించి ఆలోచించడం ఈ ప్రమాణం యొక్క ఉద్దేశమని తెలిపారు. ప్రేమను ఎవరూ వ్యతిరేకించరు కాని యువత ప్రేమ, లైంగిక ఆకర్షణల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల కోసం స్కూల్లు, కాలేజీలకు పంపుతారని.. కొందరు పారిపోవడం వంటివి చేయడం వల్ల వారు మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నరు. కాబట్టి వారి తల్లిదండ్రుల పట్ల బాధ్యత, విలువలను పెంపొందించడం తమ కర్తవ్యమని హవ్రే అన్నారు.